MLC elections Counting: 6 ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం 8 గంటలకు ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగ్గా.. ఈరోజు కౌంటింగ్ చేస్తున్నారు.

New Update
MLC poling

MLC poling Photograph: (MLC poling)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం 8 గంటలకు ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 70 మంది, తెలంగాణలో 90 మంది అభ్యర్థులు MLC ఎన్నికల పోటీ చేశారు. ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుండగా.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓట్ల లెక్కింపు మార్చి 3న(నేడు) ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు కౌంటింగ్ పర్యవేక్షిస్తున్నారు.

Also read : Blue Ghost : చంద్రుడిపైకి దారులు.. మూన్‌పై సేఫ్‌గా ల్యాండైన ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ ఇదే

మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ జిల్లాల పట్టభద్రులు, అదే జిల్లాల ఉపాధ్యాయ, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ నిర్వహించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 973 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు చేస్తున్నారు అధికారులు. 

Also read :  Group Exams Results: గ్రూప్స్ అభ్యర్థులకు అలెర్ట్‌.. ఫలితాలపై కీలక అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు