Mayawati : అధికారంలోకి వస్తే.. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం : మాయావతి

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత మాయావతి హామీ ఇచ్చారు. ఆదివారం ముజఫర్‌నగర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Mayawati : అధికారంలోకి వస్తే.. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం : మాయావతి

West UP Will Be Special State : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) మాజీ సీఎం, బీఎస్పీ అధినేత మాయావతి(Mayawati) ఎన్నికల ప్రచారం(Election Campaign) లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం ముజఫర్‌నగర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత ప్రజల్లో అభివృద్ధి తీసుకొచ్చేందుకు పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే.. పేదలు, కార్మికులు, చిరువ్యాపారులు, రైతుల అవసరాలను గుర్తించి సేవలు చేయడంతో పాటు పశ్చిమ యూపీ అభివృద్ధికి చొరవ చూపుతామని అన్నారు.

Also read: విపక్ష పార్టీలు ఎందుకు బలహీనంగా ఉన్నాయో చెప్పిన అమర్త్య సేన్

అయితే మజఫర్‌నగర్‌ నియోజకవర్గం అభ్యర్థిగా దారా సింగ్ ప్రజాపతిని బీఎస్పీ ఎస్పీ ఎన్నికల బరిలోకి దింపింది. మరోవైపు ఈ నెల 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగాయి. ఎన్నికల్లో గెలుపొందే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఆదివారం బీజేపీ సంకల్ప పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

Also Read:బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు