Delhi Liquor Scam : జైల్లోనే అరవింద్‌ కేజ్రీవాల్‌కు కార్యాలయం : భగవంత్ మాన్

ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌.. జైలు నుంచే పరిపాలన చేస్తారని పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ అన్నారు. జైల్లో ఆయన కోసం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి పర్మిషన్ కూడా తీసుకుంటామని తెలిపారు.

New Update
Delhi Liquor Scam : జైల్లోనే అరవింద్‌ కేజ్రీవాల్‌కు కార్యాలయం : భగవంత్ మాన్

Aravind Kejriwal : లిక్కర్ స్కామ్‌(Liquor Scam) లో అరెస్టయిన ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్‌ కేజ్రీవాల్(Aravind Kejriwal) అంశం చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయన ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉంటారా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేజీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండటంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Also Read : ఆ ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ తీసుకొచ్చాం: నితిన్ గడ్కరీ

అయితే ఈ అంశంపై తాజాగా పంజాబ్‌ సీఎం(Punjab CM), ఆప్(AAP) నేత భగవంత్ సింగ్ మాన్(Bhagwant Singh Mann) స్పందించారు. కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన చేస్తారని తెలిపారు. జైల్లో ఆయన కోసం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి పర్మిషన్ కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ కూడా భర్తీ చేయలేరని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగానే ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ స్థాపించినట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మనీలాండగరింగ్ కేసు(Money Laundering Case) లో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చని న్యాయ నిపుణలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి అరెస్టయితే ఆ పదవిలో కొనగాడంపై చట్టంలో ఎలాంటి నిషేధం లేదని ఓ సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. సాంకేతిక జైలు నుంచి పాలించడం సాధ్యమవుతుందని అన్నారు. అయితే చట్టంలో ఎలాంటి నిషేధం లేకున్నా పరిపాలనా పరంగా కొనసాగడం అసాధ్యమేనని మరో న్యాయవాది తెలిపారు.

Also Read : సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ

Advertisment
Advertisment
తాజా కథనాలు