ఫోన్ గొడవ.. భర్త కండ్లను కత్తెరతో పొడిచేసిన భార్య

తన ఫోన్ చూసి ఇస్తానని అడిగిన భర్త కండ్లను ఇల్లాలు పొడిచేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అంకిత్ యూట్యూబ్ చూసి ఇస్తానని అడిగితే ప్రియాంక ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా కత్తెరతో అంకిత్ కండ్లు పోడిచేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
ఫోన్ గొడవ.. భర్త కండ్లను కత్తెరతో పొడిచేసిన భార్య

CRIME : వేగంగా మారుతున్న కాలానుగుణంగా మనుషుల్లో ఊహించనంతగా మార్పులు రావట్లేదు. కాలానికంటే వేగంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ దానిని వినియోగించుకోవడంలో కొంత సమాజం సక్సెస్ కావట్లేదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారింది. ఒక పూట ఫుడ్ లేకపోయినా ఓర్చకుంటున్నారు కానీ.. తమ వెంట మొబైల్ లేకపోతే ఉండలేకపోతున్నారు. ప్రతి సెకన్ కు ఒకసారి మోగే నోటిఫికేషన్ చూడకుంటే ఏదో కోల్పోయినట్లు గాబరా పడుతుంటారు. అయితే ఈ సాంకేతికతను కొంతమంది తమకు ఉపయోగపడే విధంగా వాడుకుంటే.. మరికొంతమంది దీని వల్ల తప్పుదోవ పడుతున్నారు. సరైన మార్గంలో యూజ్ చేసుకునే అవగాహన లేక దానిని ఒక ప్రైవసీగా భావించి కుటుంబ సభ్యులతో సంబంధం కోల్పోతున్నారు. సెల్ ఫోన్(Cell Phone) లో అడ్డదిడ్డంగా రిలేషన్స్ పెట్టుకుని నిరంతరం అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే తన మొబైల్ ఎవరైనా చూస్తే తట్టుకోలేకపోతున్నారు. తమ సీక్రెట్స్ చూస్తారేమో అనే భయంతో పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది భార్య భర్తల మధ్య కూడా వివాదాలకు కారణమవుతుంది. ఒకరి మొబైల్ ఒకరు చూసే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తోంది. ఈ మేరకు సెల్ ఫోన్ వల్ల ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో చిచ్చు మొదలవగా పలు దాడులు, కేసులు జరిగిన సంఘటలున్నాయి. అచ్చం ఇలాంటి ఓ దారుణమైన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttar Pradesh) జరిగింది. భర్త ఫోన్ అడిగాడనే కోపంలో ఓ భార్య కండ్లను పొడిచేసిన సంఘటన బాగ్‌పత్‌లో కలకలం రేపింది.

ఇది కూడా చదవండి : BREAKING: అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

ఈ మేరకు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. భర్త అంకిత్‌ యూట్యూబ్‌లో పాటలు చూడటానికి మొబైల్‌ ఫోన్‌ ఇవ్వాలని తన భార్య ప్రియాంకను అడిడాడు. అయితే ఇవ్వడానికి అంగీకరించని ప్రియాంక.. తన ఫోన్ లోనే చూసుకోవాలని సూచించింది. అయినా వినకుడా అంకిత్ పదే పదే కావాలంటూ విసిగించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. విచక్షణ కోల్పోయిన ప్రియాంక.. భర్తపై దాడి చేసింది. ఇంట్లో ఉన్న కత్తెరతో(Scissor)అంకిత్ కంట్లో పొడిచింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన అంకిత్ అరుపులు అందుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, కుటుంబ సభ్యులు అంకిత్ ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ప్రాణపాయం లేదు. అయితే కంటి చూపుపై ఇంకా రిపోర్ట్ రావాల్సివుందని తెలిపిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు