Bath: నైట్ స్నానం చేయకుండా నిద్రపోతున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోండి..! రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇది విశ్రాంతినిస్తుంది. మీ శరీరాన్ని క్లీన్ చేస్తుంది. మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. గోరు వెచ్చటి నీటితో స్నానం రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. సో నైట్ బాత్ చేసే నిద్రపోండి. By Trinath 07 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి రోజంతా వర్క్ చేసి.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను క్రాస్ చేసి.. చాలామంది వాహనాల మధ్యలో చిక్కుకొని నైట్ ఎప్పటికో ఇంటికి చేరుతుంటారు. ఇంటికి వెళ్లగానే బెడ్‌పైన వాలిపోవాలన్నంతా అలిసిపోతారు. మరోవైపు ఆకలి దంచేస్తుంటుంది. తట్టుకోలేక తినేస్తారు.. తర్వాత బద్ధకం పుడుతుంది. ఇంక బెడ్ ఎక్కి నిద్రపోరు. ఇలా చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కనీసం కాళ్లు కూడా కడుక్కొరు.. నిద్రపోతారు. దీని వల్ల చర్మ సమస్యలు వస్తాయి. అటు విద్యార్థులు సైతం స్కూల్ లేదా కాలేజీకి వెళ్లడం.. తర్వాత కాసేపు ఆడుకోని రావడం, తినడం, నిద్రపోవడం చేస్తుంటారు. అన్నిటికంటే ముఖ్యమైన స్నానాన్ని మాత్రం నెగ్‌లెక్ట్ చేస్తారు. ఇలా స్నానం చేయకుండా నిద్రపోవడం వల్ల మన బాడీ పరిశుభ్రతపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. ఉదయం ఎక్కడ ఎక్కడో తిరిగి వస్తాం. మనకు తెలియకుండానే మన శరీరంపై బ్యాక్టిరియా పేరుకుపోయి ఉంటుంది. అనేక క్రిములు మన బాడీపై ఉంటే వాటినే స్కిన్ ఎలర్జి రావొచ్చు. అందులోనూ సిటీల్లో ఉండే వారికి పొలూష్యన్ సమస్య అధికంగా ఉంటుంది. అందుకే రాత్రి పోయే ముందు కచ్చితంగా స్నానం చేయాలి. మన బాడీ లోపల ప్యూరిఫైకి వాటర్ ఎంత ముఖ్యమో.. బాడీ బయట క్లీన్‌గా ఉండటానికి స్కి్‌న్‌కు బాత్ అంతే ముఖ్యం. ఎంత బద్ధకంగా అనిపించినా బాత్ చేయండి.. మీకు హ్యాపీగా నిద్రపట్టడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ప్రతీకాత్మక చిత్రం నైట్ నిద్రకు ముందు ఎందుకు స్నానం చేయాలో తెలుసుకోండి: వ్యక్తిగత పరిశుభ్రత: స్నానం చేయకుండా నిద్రపోతే మీ చర్మంపై చెమట, ధూళి, నూనెలు పేరుకుపోతాయి. శరీర దుర్వాసన వస్తుంది. ఇది మీకు మీ చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పెడుతుంది. చర్మ ఆరోగ్యం: క్రమం తప్పకుండా స్నానం చేయడం ముఖ్యం. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మృత చర్మ కణాలను తొలగిస్తుంది. స్నానాన్ని అదే పనిగా స్కిప్ చేస్తే చర్మ సమస్యలకు గురికావొచ్చు. కంఫర్ట్: పడుకునే ముందు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల విశ్రాంతి లభించిందన్న ఫీలింగ్ కలుగుతుంది. వెచ్చని స్నానం మీ కండరాలకు విశ్రాంతినిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రవేళకు ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఇది బెస్ట్ వే. మెరుగైన నిద్ర నాణ్యత: వెచ్చని స్నానం తర్వాత శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది మీ శరీరానికి నిద్రపోయే సమయం అని సూచిస్తుంది. మెరుగైన నిద్ర నాణ్యతకు దారి తీస్తుంది. ఫాస్ట్‌గా నిద్రపోయేలా చేస్తుంది. ప్రతీకాత్మక చిత్రం స్నానం మీ చర్మాన్ని శుభ్రపరచడానికి, హైడ్రేట్ చేయడానికి ఒక అవకాశం. సరైన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మెరుగైన ప్రసరణ: వెచ్చని నీటీ స్నానం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. Also Read: మందుబాబులకు అలెర్ట్.. మానకపోతే జరిగేది ఇదే..! WATCH: #sleep-tips #bath #sleep-tips-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి