Telangana : లోక్‌సభ ఎన్నికల్లో ఆ వైఫల్యాలే కాంగ్రెస్‌ను దెబ్బతీశాయా ? తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 17 స్థానాల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిక్యంలో ఉండగా.. మరో 8 స్థానాల్లో బీజేపీ జోరు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ ప్రభావం చూపించకపోవడానికి కారణాలెంటో ఈ ఆర్టికల్‌లో చదవండి. By B Aravind 04 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Lok Sabha Elections : తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో (Telangana Parliament Elections) కాంగ్రెస్ (Congress) కు బీజేపీ (BJP) గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 17 స్థానాల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిక్యంలో ఉండగా.. మరో 8 స్థానాల్లో బీజేపీ జోరు కొనసాగిస్తోంది. ఇక ఎంఐఎం (MIM) ఒక స్థానాన్ని దక్కించుకోగా.. బీఆర్ఎస్ మాత్రం ఇంతవరకు ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే గట్టి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి సమానంగా బీజేపీ సీట్లు సాధించనుంది. దీన్ని బట్టి చూస్తే.. కాంగ్రెస్ వ్యతిరేకత ఓటు మొత్తం కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్లింది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 10కి పైగా సీట్లలో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసినప్పటికీ అంతగా ప్రభావం చూపించలేదు. కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Also Read: బీఆర్ఎస్ ఘోర పరాభవం.. ఈ కారణాలే కేసీఆర్ ను దెబ్బతీశాయా! అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 100 రోజుల్లోనే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ చివరికి ఈ ఆరు హామీలు పూర్తిగా అమలు కాలేవు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. అలాగే పలు స్థానాల్లో కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపడం కూడా బీజేపీకి కలిసిచ్చొంది. ఉదాహరణకు చేవెళ్లలో.. బీఆర్‌ఎస్ (BRS) నుంచి వచ్చిన రంజీత్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకొని బరిలోకి దింపడం ఆ పార్టీకి కలిసిరాలేదు. అలాగే మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ లాంటి బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల ఫోకస్ చేయకపోవడం కాంగ్రెస్‌కు మైనస్. ఇప్పటికే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కోతలు మొదలయ్యాయి. అర్బన్ ఏరియాల్లో కూడా కరెంటు కోతలు వెలుగుచూడటం కాంగ్రెస్‌పై ఓటర్లలో వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడం ఆ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా బీఆర్ఎస్‌కు వచ్చే ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ దృష్టిపెట్టకపోవడం వల్ల.. ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు మళ్లింది. Also read: అమిత్ షా సంచలన రికార్డు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. మొత్తం రెడ్ల రాజ్యం అంటూ సాగిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. అలాగే రైతుభరసా, వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం, రుణమాఫీ అమలు చేయకపోవడం, పలుచోట్ల సాగునీరు పూర్తిగా అందకపోవడం, కరెంటు కోతలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పట్ల ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. దీంతో కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా కూడా పూర్తిగా బీజేపీ వైపు మళ్లడం ఆ పార్టీకి కలిసొచ్చింది. #telugu-news #congress #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి