Money Tips: ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50వేల నుంచి 10లక్షల వరకు లోన్...మీరు అర్హులో కాదో తెలుసుకోండి..!

ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీంలో రూ. 50వేల నుంచి రూ. 10లక్షల వరకు బ్యాంక్ లోన్ పొందవచ్చు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండానే ఈ మొత్తం లోన్ పొందవచ్చు. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

New Update
Money Tips: ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50వేల నుంచి 10లక్షల వరకు లోన్...మీరు అర్హులో కాదో తెలుసుకోండి..!

Pradhan Mantri Mudra Yojana Scheme : కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ పలు పథకాలతో పారిశ్రామిక రంగాలకు ప్రోత్సహాకాలను అందిస్తోంది. కార్పొరేట్, వ్యవసాయేతర, చిన్న, సూక్ష్మ సంస్థలకు ఆర్థికసాయం అందించే లక్ష్యంతో 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీంను ప్రారంభించారు. ఈ స్కీం కింద కమర్షియల్ బ్యాంకులు, ఆర్ఆర్బిలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎంఎఫ్ఐలు, ఎన్బీఎఫ్సీలు సహా పలు ఆర్థికసంస్థ ద్వారా అర్హత కలిగిన వ్యక్తులకు రూ. 10లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండానే లోన్లను మంజూరు చేస్తారు.

ఈ లోన్లకు ఎవరు అర్హులంటే?
మైక్రో యూనిట్స్ విభిన్న నిధుల అవసరాలను తీర్చేందుకు ముద్ర మూడు ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అవి శిశు కిషోర్, తరుణ్ లోన్, శిశు కేటగిరీ కింద రూ. 50వేల వరకు కిషోర్ విభాగంలో రూ. 50వేల నుంచి 5లక్షల వరకు అందిస్తారు. తరుణ్ కింద అత్యధికంగా రూ. 5లక్షల నుంచి రూ10లక్షల వరకు లోన్స్ అందిస్తారు. యువతలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రొత్సహించేందుకు ప్రత్యేకంగా శిశు కేటగిరీ యూనిట్స్ పై ఫోకస్ పెట్టారు.

రెండు విభిన్న పథకాల ద్వారా లోన్స్:
రెండు విభిన్న పథకాల ద్వారా లోన్స్ అందిస్తారు. మొదటిది మైక్రో క్రెడిట్ స్కీం. ఈ స్కీం ద్వారా రూ. 1లక్ష వరకు రుణాలు అందిస్తారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా సులభం అవుతుంది. రెండోస్కీం రీఫైనాన్స్ స్కీం. ఇది వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీం కింద, అర్హత కలిగిన రుణగ్రహీతలకు రుణాలను అందించేందుకు ఈ ఆర్థిక సంస్థలు ముద్ర నుంచి రీఫైనాన్స్ సపోర్టు కూడా పొందవచ్చు.

అర్హతప్రమాణాలు:
ముద్ర యోజన స్కీం ద్వారా లబ్ది పొందాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. రుణం తీసుకునేందుకు అర్హత కలిగి ఉండాలి. చిన్న బిజినెస్ ఎంటర్ ప్రైజస్ కోసం బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకున్న వ్యక్తి ఈ పథకం కింద లోన్ పొందవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీస్ సెక్టార్స్ లో ఇన్ కమ్ జనరేటింగ్ యాక్టివిటీలకు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలకు లోన్స్ పొందవచ్చు. దరఖాస్తుదారులు లోన్ డిఫాల్ట్ హిస్టరీని కలిగి ఉండకూడదు. దరఖాస్తుదారు వ్యాపారం కనీసం మూడేళ్ల నుంచి చేస్తుండాలి. 24 నుంచి 70ఏళ్ల మధ్య వయస్సున్నవారై ఉండాలి.

ఇది కూడా చదవండి: వామ్మో…వేగంగా విస్తరిస్తోన్న జాంబీ డీర్ డిసీజ్…మరో పెను ముప్పు తప్పదా..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు