WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అన్నోన్ నంబర్ల నుంచి నో మెసేజెస్ వాట్సాప్ మళ్ళీ కొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇది ముఖ్యంగా భద్రతకు సంబంధించినది. ఇక మీదట నుంచి కొత్త నంబర్ల నుంచి మెసేజ్‌లు రాకుండా వాట్సాప్ అడ్డుకట్టవేయనుంది. By Manogna alamuru 01 May 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి WhatsApp New Feature : సోషల్ మీడియా(Social Media) లో వాట్సాప్(WhatsApp) అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది. దాదాపు అందరూ వాడేది ఇదొక్కటే. అందుకే వాట్సాప్‌ను కూడా మెటా(Meta) ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు వాట్సాప్ యూజర్ల భద్రత మీద దృష్టి పెట్టింది. లాస్ట్ ఇయర్ స్పామ్ కాల్స్‌ను అరికట్టడానికి సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ ఫీచర్(Unknown Feature) ను తీసుకువచ్చింది. దాంతో పాటూ స్పామ్ కాల్స్ బాగా పెరిగినప్పుడు వాటిని అరికట్టడానికి లక్షల మంది ఖాతాలను కూడా నిషేధించింది కూడా. ఇప్పుడు దీనికి సంబంధించినదే మరో కొత్త ఫీచర్‌ను తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు ఫోన్ నంబర్ ఉంటే ఎవరికైనా వాట్సాప్‌లో మెసేజ్ చేయవచ్చును. దీనివలన ఉద్యోగాలని, ఆఫర్లని ఇలా చాలా స్పామ్ మెసేజులు వస్తుంటాయి. వీటిని ఓపెన్ చేసి చిక్కుల్లో పడ్డవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడ ఈ తరహా మోసాలను అడ్డుకట్ట వేసేందుకే వాట్సాప్ నడుం కట్టింది. దీనికి సంబంధించి కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉంది. అదేంటంటే.. అపరిచితుల నుంచి ఇక మీదట వాట్సాప్ మెసేజ్‌లు రావు. ఒకవేళ చాట్ చేయడానిక ప్రయత్నిస్తే మీ ఖాతా తాత్కాలికంగా రెస్ట్రిక్ట్ అయింది అంటూ పాప్ అప్ బాక్స్ కనిపిస్తుంది. వాట్సప్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి, స్పామ్ ఖాతాలను రెస్ట్రిక్ట్ చేసేందుకు ఈ ఫీచర్ సాయపడనుంది. స్కామర్‌లు, ఇతర మోసాలకు పాల్పడే ఖాతాలకు ఇదో హెచ్చరిక లాంటిదని వాట్సప్ సమాచారాన్ని అందించే వాబీటా ఇన్ఫో తెలిపింది. అయితే ఇది ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఎంత సేపు కొత్త అకౌంట్లను అడ్డుకోవచ్చును? పూర్తిగా కూడా అడ్డుకోవచ్చా లాంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. Also Read:Telangana Game Changer: తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఫలితాలు ఇలా.. రవిప్రకాశ్ చెప్పిన సంచలన లెక్కలివే! #whatsapp #new-feature #restriction #unknown-feature మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి