Smart Review System : రివ్యూ రూల్‌లో మార్పు.. కొత్త సిస్టమ్‌పై ఓ లుక్కేయండి!

క్రికెట్‌లో కొన్నిసార్లు అంపైర్లు తీసుకునే తప్పుడు నిర్ణయాలు మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తాయి. అందుకే కరెక్ట్‌ డెసిషన్‌ కోసం డీఆర్‌ఎస్‌ లాంటి వ్యవస్థలను తీసుకొచ్చారు. రానున్న ఐపీఎల్‌ లో కొత్తగా స్మార్ట్‌ రివ్యూ సిస్టమ్‌ని ప్రవేశపెట్టబోతున్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Smart Review System : రివ్యూ రూల్‌లో మార్పు.. కొత్త సిస్టమ్‌పై ఓ లుక్కేయండి!

Smart Review : ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ప్రారంభానికి ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings) తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)(ఆర్సీబీ) తలపడనుంది. ఐపీఎల్ 17 సీజన్‌(IPL 17 Season) స్టార్ట్‌కు ముందు రివ్యూ విధానంలో బీసీసీఐ భారీ మార్పులు చేసింది. ఈ సీజన్‌లో కొత్తగా స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను తీసుకురానుంది. ఈ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా అంపైర్ డిసిషన్‌ కరెక్ట్‌గా వచ్చే ఛాన్స్ పెరుగుతోంది.

అసలేంటి స్మార్ట్‌ రివ్యూ సిస్టమ్‌:
ఈ స్మార్ట్ రివ్యూ సిస్టమ్(Smart Review System) వల్ల పొరపాట్లు తగ్గుతాయి. థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవడం ఈజీ అవుతుంది. ఈ రివ్యూ సిస్టమ్‌ కోసం గ్రౌండ్‌లో హాక్ ఐకి చెందిన ఎనిమిది హైస్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. థర్డ్ అంపైర్ వద్ద ఇద్దరు కెమెరా ఆపరేటర్లు కూడా ఉంటారు. దీంతో టీవీ అంపైర్ కు ఈ ఇద్దరు ఆపరేటర్ల నుంచి నేరుగా ఇన్ పుట్ వస్తుంది. కొత్త వ్యవస్థతో టీవీ అంపైర్లు విజువల్స్ ను మరింత మెరుగ్గా విశ్లేషించగలుగుతారు. ఈ స్మార్ట్ రివ్యూ సిస్టమ్ కింద స్క్రీన్ పై కచ్చితమైన విజువల్స్ కనిపిస్తాయి. అంతే కాదు స్ప్లిట్‌ స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంతో అంపైర్లు వివిధ కోణాల్లో స్పష్టమైన విజువల్స్‌ను చూడగలుగుతారు.

ఈ స్మార్ట్ రివ్యూ సిస్టమ్ ను ఇంగ్లాండ్ లీగ్ ది హండ్రెడ్ టోర్నమెంట్ లో కూడా పరీక్షించారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ది హండ్రెడ్ సమయంలో స్మార్ట్ రివ్యూ సిస్టయ్‌ను పరీక్షించింది.

Also Read : RCB పేరు మార్పు.. ఈసారైనా అదృష్టం వరించేనా!?

Advertisment
Advertisment
తాజా కథనాలు