fenugreek benefits: చలికాలంలో మగవాళ్లు మెంతికూర తింటే ఏమవుతుంది?

చలికాలంలో ఎన్నో రకాల వైరస్‌లు మనపై దాడి చేస్తుంటాయి. మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఆహారం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెంతికూరతో చాలా రకాల వంటకాలు చేసుకుని తింటా. మెంతికూర వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ పెరగడంతో పాటు ఎల్లప్పుడూ లోపలి నుంచి వేడిగా ఉంటుంది.

New Update
fenugreek benefits: చలికాలంలో మగవాళ్లు మెంతికూర తింటే ఏమవుతుంది?

fenugreek benefits: ప్రస్తుత కాలంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలి తీవ్రత కూడా బాగా పెరుగుతోంది, ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలికాలంలో ఎన్నో రకాల వైరస్‌లు మనపై దాడి చేస్తుంటాయి. మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఆహారం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ శరీరాన్ని వేడిగా ఉంచే ఆహారం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవాలని చెబుతున్నారు. ఆకు కూరలను ఎక్కువగా తినడం వల్ల రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది. చలికాలంలో తప్పక తినాల్సిన ఆకు కూరల్లో మెంతి కూర ఒకటి. మెంతికూరతో చాలా రకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాం. మెంతికూర వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ పెరగడంతో పాటు ఎల్లప్పుడూ లోపలి నుంచి వేడిగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఇంట్లో చీమలను తరిమేసే చక్కటి చిట్కాలు
చలికాలంలో మెంతి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. మెంతిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం..ఇవి మన శరీరాన్ని దగ్గు, గొంతునొప్పితో పాటు జలుబులాంటి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. సాధారణంగా శీతాకాలంలో జీవక్రియల రేటు అత్యల్పంగా ఉంటుంది. మెంతికూర తినడం వల్ల జీవక్రియల రేటు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కూడా బాగా అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా మెంతికూర తింటే టైప్‌-2 మధుమేహం దరిచేరదని అంటున్నారు. స్త్రీలకు కూడా మెంతికూర వరం అని చెప్పాలి.
హార్మోన్ల సమస్యలు తగ్గిపోతాయి
మెంతికూర‌ తింటే నెల‌సరి టైమ్‌లో వచ్చేటువంటి నొప్పి తగ్గిపోతుంది. మహిళలు మెంతికూర తిన్నా..మెంతులతో చేసిన టీ తాగినా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా మన బాడీలోని హార్మోన్ల అస‌మ‌తుల్యత వల్ల కలిగే సమస్యలు తగ్గిపోతాయని వైద్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడానికి కూడా మెంతికూర అద్భుతంగా ఉపయోగపడుతుంది. మెంతిలో క్యాలరీలు తక్కువశాతం ఉండటం వల్ల సులభంగా బరుపు తగ్గవచ్చు. మెంతికూర వల్ల మగవారిలో లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుంది. లైంగిక సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే మెంతికూరను చలికాలంలో తప్పక తినాలని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: పారిజాత చెట్టుతో ప్రయోజనాలెన్నో..ఇంట్లో ఉండాల్సిందే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా.. ఇంకా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. పవన్ ఆరోగ్యం, అలాగే కొడుకుకు ప్రమాదం జరగడం ఆలస్యానికి కారణమని టాక్.

New Update

HariHaraVeeraMallu Release:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన  'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలు పెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న మూవీని విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అనారోగ్యం, ఆయన కొడుకు అగ్ని ప్రమాదానికి గురవడం వంటి వ్యక్తిగత ఇబ్బందులతో షూటింగ్ ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరికొంతమంది.. ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై  'హరిహరవీరమల్లు' రిలీజ్ డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఇప్పటికే మూడు సార్లు

మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా  చేత 2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత  2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు పవన్ ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.  కానీ ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. 

cinema-news | latest-news | harihara-veeramallu-movie

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment