Mamata Banerjee: 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'పై అత్యున్నత స్థాయి కమిటీకి దీదీ లేఖ.. ఏం అన్నారంటే?

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీకి పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ లేఖ రాశారు. 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'పై ఏకీభవించడంలేదని చెప్పారు. ఈ విషయంలో ప్యానెల్‌ సూత్రీకరణ, ప్రతిపాదనతో విభేదిస్తున్నామన్నారు.

New Update
Mamata Banerjee: 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'పై అత్యున్నత స్థాయి కమిటీకి దీదీ లేఖ.. ఏం అన్నారంటే?

ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నది బీజేపీ స్ట్రాటజీ. పొలిటికల్‌గా, సిద్ధాంతపరంగా బీజేపీ అస్త్రమిది. దేశం మొత్తం ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ కల. తమ కలలను ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటున్న బీజేపీ 2024 ఎన్నికల్లో గెలిస్తే.. ఆ తర్వాత దేశంలోని మరిన్ని మార్పులకు శ్రీకారం చూడుతుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే బీజేపీ(BJP) గెలవకూడదని కాంగ్రెస్‌తో పాటు యాంటీ-బీజేపీ పార్టీలు శర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 28 పార్టీలు ఒకేతాటిపైకి రావడమే కాకుండా ఒకే మాటపై నిలపడుతున్నాయి. ఈ క్రమంలోనే 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు(One Nation One Election)'పై పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ(Mamata Banerjee) అత్యున్నత స్థాయి కమిటీకి లేఖ రాశారు.


ఏకీభవించవద్దు:
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ గురువారం రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్‌కు తెలిపింది. ఈ నెల ప్రారంభంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆయన సీపీఐ కౌంటర్ డి రాజా సమర్పించిన ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సమయంలో మమత లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత రాజ్యాంగ ఏర్పాట్ల ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ ప్రతిపాదన ఉందన్నారు దీదీ. ఒక దేశం ఒకే ఎన్నికలు అనే భావనతో ఏకీభవించవద్దని కోరారు.

మార్చకూడదు.. మార్చవద్దు:
ప్యానెల్ సెక్రటరీకి రాసిన లేఖలో మమత బెనర్జీ కీలక విషయాలను ప్రస్తావించారు. నిజానికి 1952లో మొదటి సాధారణ ఎన్నికలు కేంద్ర, రాష్ట్ర స్థాయిలకు ఒకేసారి జరిగాయి. కొన్నాళ్లుగా అలాంటి ఏకకాలికత ఉందని.. ఆ తర్వాత లేదన్నారు మమత. మీరు రూపొందించిన 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అనే భావనతో నేను ఏకీభవించలేనందుకు చింతిస్తున్నాను. మీ సూత్రీకరణ, ప్రతిపాదనతో మేము విభేదిస్తున్నాము' అని దీదీ లేఖలో రాశారు. వెస్ట్‌మిన్‌స్టర్ వ్యవస్థలో ఏకకాల సమాఖ్య , రాష్ట్ర ఎన్నికలు ఒక ప్రాథమిక లక్షణమని.. దీన్నీ మార్చకూడదన్నారు దీదీ. ఏకకాలంలో ఉండకపోవడం అనేది భారత రాజ్యాంగ ఏర్పాట్ల ప్రాథమిక నిర్మాణంలో భాగమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

Also Read: గంట మళ్లీ జంప్.. ఈ సారి పోటీ ఎక్కడినుంచంటే?
WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు