Weight Loss Tips: ఈ ఫుడ్స్ ను ఉదయాన్నే తింటే.. అస్సలు బరువు తగ్గరు..!!

ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే..ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు..బరువు కూడా అదుపులోఉండాలి. బరువు పెరుగుతున్నా కొద్దీ ఎన్నో వ్యాధులు పలకరిస్తుంటాయి. వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు బరువు తగ్గాలని వైద్యులు సూచించడం మనం వింటూనే ఉంటుంటాం. బరువు తగ్గడం కోసం ఏం తింటున్నారు? ఎప్పుడు తింటున్నారు? ఇది కూడా చాలా ముఖ్యం.

New Update

పోషకాహార నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం..మీరు కొలెస్ట్రాల్ ను కోల్పోవాలంటే బ్రేక్ ఫాస్ట్ పోషకాలతో కూడినదిగా ఉండాలి. బరువు తగ్గేందుకు మీకు సహాయపడే కొన్ని ఆహారాలతో మీ రోజును ప్రారంభించాలి. కానీ చాలా మంది అల్పాహారం కోసం తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు. తర్వాత వారికి నచ్చినవి తింటుంటారు. దీంతో బరువు ఆమాంతం పెరగడంతోపాటు శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. వెంటనే ఈ ఆహారాలను మీ ప్లేట్లో నుంచి తొలగించడం చాలా ముఖ్యం.

ఇదికూడా చదవండి: ఈ ఐదు పండ్లతో మలబద్ధకానికి చెక్‌..ప్రాబ్లెమ్స్‌ అన్ని ఫసక్‌..!

బిస్కెట్లు, కుకీలు:
ఈ బేకరి వస్తువులు తినేందుకు రుచిగా ఉంటాయి. కానీ ఇవి అనారోగ్యానికి గురి చేస్తాయని మీకు తెలుసా. ఇందులో అనేక అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, చక్కెర ఉంటుంది. ఇవి తింటే బరువు పెరుగుతారు.

కాఫీ, టీ:
చాలామందికి ఉదయం కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీతో పాటు బిస్కెట్లు కుకీలు తింటారు. కుకీలు మిఠాయిలు, చక్కెర తృణధాన్యాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగడంతోపాటు బరువు కూడా పెరుగుతారు.

చిప్స్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్:
ప్రతిరోజూ వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారు. వీటిలో అధిక కేలరీలు ఉంటాయి. నూనెలో వేయించిన ఆహారం ఉదయం తినకపోవడమే మంచిది. పండ్లు, కూరగాయలు, పెరుగు, గింజలు, వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం మంచిది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం నట్స్, వెన్న, పాప్ కార్న్ వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది.

బ్రెడ్:
చాలామందికి ఉదయం బ్రెడ్ తినే అలవాటు ఉంటుంది. బ్రెడ్ పై ఎక్కువగా జామ్ కానీ వెన్న కానీ వేసుకుని తింటుంటారు. తినడానికి రుచిగా ఉంటుంది. కానీ బరువు తగ్గాలంటే బ్రెడ్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల బరువు వేగంగా పెరుగుతారు.

ఇదికూడా చదవండి: మీ భర్త రొమాంటిక్‌గా ఉండడంలేదా? ఇలా చేయండి.. ఇక మిమ్మల్ని వదలడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు