Badhrachalam: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది.
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది.
ఏపీని వరుణుడు విడిచిపోను అంటున్నాడు. అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మంగళవారం కూడా ఏపీలో పలుచోట్ల వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని షంశీర్ గంజ్లో రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పర్యటించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చాకల పాలెం - కనకాయలంక కాజ్వే నీట మునిగిపోయింది. దీంతో స్థానికుల పరిస్థితి దయానీయంగా మారింది. గోదావరి వరద ప్రవాహంలో బాలింత పసిబిడ్డతో పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 23 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల రామప్ప ఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది. రాతి స్తంభాల నుంచి కక్షాసన ప్రదేశంలోకి నీరు చేరడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గతంలో కూడా ఒకపైపు రామప్ప టెంపుల్ కుంగిపోయింది.
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను అనుకొని ఛత్తీస్గడ్ మీదుగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.