/rtv/media/media_files/2025/07/19/pakistan-monsoon-rains-kill-63-in-24-hours-2025-07-19-08-05-32.jpg)
Rains
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, అలాగే వాతావరణంలో ఏర్పడిన పలు మార్పుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
HyderabadRains ALERT 3 ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) June 10, 2026
SCATTERED THUNDERSTORMS have covered Serlingampally, Gachibowli, Shaikpet stretch to further cover Central, South Hyderabad City like Jubliee Hills, Khairthabad, Shaikpet, Tolichowki, Rajendranagar and nearby areas next 1hr, plan accordingly ⚠️⛈️…
ఈ జిల్లాల్లో వర్షాలు..
ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, వికార్‌ఆబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రానికి దగ్గర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
Follow Us