/rtv/media/media_files/2025/07/19/pakistan-monsoon-rains-kill-63-in-24-hours-2025-07-19-08-05-32.jpg)
Rains
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాబోయే కొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా హెచ్చరించింది. నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
THUNDERSTORM ALERT - 6.30AM ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) June 12, 2026
Scattered INTENSE THUNDERSTORMS and HEAVY RAINS to continue in Nagarkurnool, Nalgonda (Peddavura to Miryalaguda stretch), Suryapet (Huzurnagar - Kodad), Yadadri - Bhongir (Mothkur - Addagudur) in next 2hrs ⚠️
During early hours, scattered rains…
ఇప్పటికే హైదరాబాద్‌లో అక్కడక్కడా వర్షాలు మొదలయ్యాయి. రాబోయే గంటల్లో, తెల్లవారుజామున నగరం మొత్తం భారీ వర్షంతో తడిసిముద్దయ్యే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉండటంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. వర్షం పడుతున్నప్పుడు కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగలకు చాలా దూరంగా ఉండాలని తెలిపారు. పాతబస్తీ లేదా పాత ఇళ్లలో నివసించే వారు గోడల పరిస్థితిని గమనించుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇది కూడా చూడండి:Ireland: : ఐర్లాండ్‌లో అల్లర్లు.. వలసదారులను లక్ష్యంగా చేసుకున్న హింస
ELNINO PATTERN TO DISRUPT MONSOON TILL JUNE 17/18
— Telangana Weatherman (@balaji25_t) June 11, 2026
The monsoon will halt at South Telangana as Elnino put the brakes and other 70% of Telangana is expected to have PROLONGED SUMMER HEAT and DELAYED MONSOON
North, East Telangana temperatures will cross 43°C at few places,…
Follow Us