/rtv/media/media_files/2024/12/17/wJzsdG0WEh17U8o3yNaP.jpg)
Weather update
Weather Update: వసంతకాలం రాకతో మెల్లి మెల్లిగా వాతావరం వెచ్చగా మారుతోంది. చలి తీవ్రత దాదాపు తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఎండలతో ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇది ఇలా ఉండగా.. తాజాగా వాతావరణ శాఖ పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ సమీకరణను విడుదల చేసింది. రాబోయే 24 గంటల్లో హర్యానా, పంజాబ్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచుతో రోడ్డు రైలు ట్రాఫిక్‌లో సమస్యలు తలెత్తవచ్చని వాతావరణ శాఖా సూచిస్తోంది.
వెదర్ అప్డేట్
ఉత్తరప్రదేశ్ లో ఈరోజంతా చల్లని పశ్చిమ గాలులు వీస్తాయి. ఫిబ్రవరి 15 నాటికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. హర్యానా, పంజాబ్‌లలో వాతావరణ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 9, 10 తేదీలలో పొంగమంచుతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. బీహార్‌లో కూడా రోజంతా బలమైన పశ్చిమ గాలులు వీచే అవకాశం ఉంది.
Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!
ఢిల్లీ వాతావరణ
ఫిబ్రవరిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తుఫాను, వర్షం పడే అవకాశం ఉంది. పగటిపూట బలమైన గాలులు వీస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు హర్యానాతో పాటు అనేక ప్రాంతాల్లో మారుతున్న వాతావరణ ప్రభావం రాజధాని ఢిల్లీలో కూడా కనిపిస్తుంది. తేలికపాటి చినుకులు లేదా బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది.
Also Read: Naga Chaitanya: బ్రేకప్ బాధేంటో నాకు తెలుసు.. సమంతతో విడాకులపై కన్నీరు పెట్టించే చైతూ వీడియో!
Also Read: Neha Shetty: ఎల్లో డ్రెస్ లో టిల్లు బ్యూటీ గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్!