/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, అల్పపీడన పరిస్థితుల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 'జాంగ్మీ' తుపాను రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాను ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: Raidurgam : రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్: రాయదుర్గంలో ఎకరం స్థలం రూ.237 కోట్లు!
🌧️#Monsoon2026
— Anmol Bali ਅਨਮੋਲ ਬਾਲੀ (@AnmolBali9) May 28, 2026
The southwest monsoon is tracking right on schedule!
Here is when to expect relief from the heat across India:
🔹 June 1:Kerala & Northeast
🔹 June 5:Karnataka & Tamil Nadu
🔹 June 10:Maharashtra (Mumbai) & Odisha
🔹 June 15:Central India & Bihar
🔹 Late… pic.twitter.com/ln3f2l6rOh
ఇది కూడా చూడండి: CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!
నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్..
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ ప్రాంతానికి చేరుకున్నాయి. జూన్ 3 లేదా 4 తేదీల్లో ఇవి కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఆ తర్వాత క్రమంగా విస్తరిస్తూ జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రుతుపవనాల వల్ల వచ్చే మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: CM Revanth Reddy : మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి
ఈ రుతుపవనాల వల్ల ఏపీలో ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నప్పటికీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. సుమారు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Japan : ఇండియాకు జపాన్ బిగ్ షాక్: ఈగలున్నాయని మామిడి పండ్లపై బ్యాన్!
Follow Us