Telangana: విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించబోం- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించేది లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. డిస్కలంను ప్రైవేటీకరిస్తున్నామని కేటీఆర్ కు ఎవరు చెప్పారో తెలీదని..ఆయనకు అసలు డిస్కమ్‌లలో ఏం జరుగుతుందో తెలుసా అని మంత్రి భట్టి ప్రశ్నించారు. By Manogna alamuru 25 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Deeputy CM Bhatti: ప్రభుత్వానికి విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచన లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. డిస్కంలను ప్రైవేటీకరణ చెయొద్దని.. దీనిపై సీఎం రేవంత్ అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. డిస్కమ్‌లలో ఏం జరుగుతుందో తెలుసా అని మంత్రి భట్టిని ప్రశ్నించారు. కరెంట్ బిల్లు కలెక్షన్లకు వెళ్తే అదానీ మనుషులు వచ్చారని, గొడవ అయ్యిందన్న విషయంపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందో లేదో తెలుసుకోవాలన్నారు. పాత బస్తీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి వారి భయాలు తొలగించాలని కోరారు. కేటీఆర్ ఆరోపణలపై భట్టి వివరణ ఇస్తూ.. హైదరాబాద్లో పవర్ సర్కిళ్లను ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని, ఎవరో పత్రికల్లో రాసినదాన్ని పట్టుకొని సభలో మాట్లాడటం ఏంటని కేటీఆర్‌పై మండిపడ్డారు. కేటీఆర్ సభతో పాటు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. భట్టి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ డిస్కమ్‌లను ప్రైవేటీకరణ చేయబోమని సీఎంతో ఒక్క స్టేట్ మెంట్ ఇప్పించాలని సూచించారు. Also Read:Tamilnadu: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాము- స్టాలిన్ #deputy-cm #bhatti-vikramarka #telangana #discom మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి