మాకు ఫ్రీ వద్దు.. బస్సు టికెట్ కొంటామంటున్న అక్కడి మహిళలు

ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం గవర్నమెంట్ మహిళా టీచర్స్ ఆదర్శవంతమైన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఆర్టీసీ అందించే ఫ్రీ టికెట్ తమకు వద్దని, టికెట్ తీసుకుని గవర్నమెంట్ కు తమవంతు ఆర్థిక సహాయం అందిస్తామని ముందుకొచ్చారు. మంచి మనసుతో మరింతమంది స్ఫూర్తిగా నిలవాలని కోరారు.

New Update
మాకు ఫ్రీ వద్దు.. బస్సు టికెట్ కొంటామంటున్న అక్కడి మహిళలు

ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసింది. ఇందులో ముఖ్యంగా 'మహాలక్ష్మీ పథకం'లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అయితే ఈ ఉచిత ప్రయాణం ఎఫెక్ట్ తో ఇప్పటికే ఆర్టీసీ, పల్లెవెలుగు బస్సులన్నీ కిక్కిరిపోతున్నాయి. దీంతో పురుషులకు సీట్లు దొరకని సందర్భాలు ఎదురుకావడంతో కొంతమంది దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మహిళలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా ఉపాధ్యాయులు మాత్రం ఉచిత ప్రయాణ విషయంలో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచారు.

ఈ మేరకు ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం యం.వెంకటాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా టీచర్స్ ఉమ్మడిగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ అందించే ఫ్రీ టికెట్ తమకు వద్దని, అందరం టికెట్ తీసుకుని గవర్నమెంట్ కు తమవంతు ఆర్థిక సహాయం అందిచేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఓ లెటర్ ను కూడా రిలీజ్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి : కోవిడ్ సబ్ వేరియంట్ పై కేరళ మంత్రి కీలక ప్రకటన

స్కూల్ అసిసెంట్స్ అసోషియేషన్ :
ఈరోజు 15.12.2023 కాంప్లెక్స్ మీటింగ్ లో మహిళామనులంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రభుత్వ ఉద్యోగం చేసే మేమంతా ఫ్రీ బస్సు, ఫ్రీ టికెట్ వాడొకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. TSRTC భవిష్యత్తు కోసం, వృద్దులు, కాలేజీ పిల్లలకు వదిలేద్దాం అనుకుంటున్నాం. అలాగే క్యాబ్ వాళ్ళకు ఉపాధినిస్తూ వారి కుటుంబాలకు సాయంగా ఉందామని ప్రతిన భూనినం. మాలాంటి వాళ్లందరికీ ఆదర్శంగా నిలుస్తాం. ప్రభుత్వం పెట్టిన ఈ స్కీము అవసరంలో ఉన్నవారు ఉపయోగించాలని, మంచి మనసుతో ఆలోచించిన వారందరూ ఎంతో మందికి స్ఫూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం.
జై మహిళా సాధికారకత.

మీ
పసుపులేటి నరేంద్రస్వామి
ఉపాధ్యాయ నాయకులు

Advertisment
Advertisment
తాజా కథనాలు