Heavy Rains : ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. పోలవరంకు భారీగా వరద ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది. మరోవైపు భద్రాచలం వద్ద 37 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. By B Aravind 21 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Andhra Pradesh : ఏపీలో వర్షాలు (Rains) దంచికొడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) కు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది. దీంతో 7 లక్షల 96 వేల 686 క్యూసెక్కుల వరద దిగువకు పంపిస్తున్నారు. రోజురోజుకు గోదావరి ఉద్ధృతి పెరుగుతుండటంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద 37 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. Also Read: భయపెడుతున్న చాందీపుర వైరస్.. 16 మంది మృతి వరద 43 అడుగులకు చేరుకుంటే అధికారులు మొదటి హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు. దీంతో గండి పోచమ్మ ఆలయం నీటమునిగింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. Also Read: భారీ వర్షాలు.. నిండుకుండలా మారిన జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు #heavy-rains #floods #bhadrachalam #polavaram-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి