Hyderabad: భారీ వర్షాలు.. డేంజర్‌లో హుస్సేన్‌సాగర్

హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద చేరుతోంది. సాగర్‌ గరిష్టస్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.65 మీటర్లకు చేరుకుంది. మంగళవారం రాత్రికి కూడా భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Hyderabad: భారీ వర్షాలు.. డేంజర్‌లో హుస్సేన్‌సాగర్

హైజరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. పలు చోట్ల 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీంతో హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద చేరుతోంది. ఇప్పటికే గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. హుస్సేన్‌సాగర్‌ గరిష్టస్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.65 మీటర్లకు చేరుకుంది. మంగళవారం రాత్రికి కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్‌ వర్షాలపై మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి సమీక్ష చేశారు. మరోవైపు తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Also Read: తెలంగాణలో రుణమాఫీపై రచ్చ.. ఎవరి వాదన కరెక్ట్?

Advertisment
Advertisment
తాజా కథనాలు