Social Media : మీకు టెస్లా కారు కావాలా?.. అయితే, ఈ పోస్టు కింద కామెంట్ చేస్తే చాలు!

వయసు చాలా చిన్నదే..కానీ ఇతని పాపులారిటీ..మంచి మనసు మాత్రం చాలా పెద్దవి. 19 ఏళ్ళకే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా మారి, 26 ఏళ్ళకే 254 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్న మిస్టర్ బీస్ట్..ఇప్పుడు తన బర్త్‌డే గిఫ్ట్‌గా టెస్లా కార్లను ఇస్తా అంటూ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు.

New Update
Social Media : మీకు టెస్లా కారు కావాలా?.. అయితే, ఈ పోస్టు కింద కామెంట్ చేస్తే చాలు!

MR Beast : అతనో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్(Social Media Influencer)..254 మిలియన్ల వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉండడమే కాకుండా భారీగా సంపాదిస్తున్నాడు కూడా. మిస్టర్ బీస్ట్(Mr. Beast) పేరుతో 26 ఏళ్లకే ఇంతమంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఇతను ఇప్పుడు తన బర్త్‌డే(Birthday) కు బంపర్ గిఫ్ట్ ఇస్తున్నాడు. తన బర్త్‌డే సందర్భంగా 26 టెస్లా కార్లను గిఫ్ట్‌గా ఇస్తాననిచెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కింద కామెంట్ చేసిన వారిలో 26 మందిని మిస్టర్ బీస్ట్ సెల‌క్ట్ చేసి, 26 కార్లను బ‌హుమ‌తిగా ఇవ్వనున్నాడు.

జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్‌సన్ ఆన్‌లైన్‌లో మిస్టర్ బీస్ట్‌గా బాగా పాప్యుల‌ర్ అయ్యారు. ఇతనొక అమెరికన్ యూట్యూబర్(American Youtuber). తి చిన్న వయసులో అతి ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. యూఎస్‌లోనే అత్యంత ఎక్కువ పాలోవర్స్ కలిగిన వ్యక్తిగా మిస్టర్ బీస్ట్ పాపులర్. ఇతనికి ఏకంగా 254 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2012 ప్రారంభంలో 13 ఏళ్ళ వయస్సులో మిస్టర్ బీస్ట్ 6000 పేరిట మొద‌ట ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఆ త‌ర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2 (గతంలో మిస్టర్ బీస్ట్ షార్ట్స్), అలాగే దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రోపీని నడుపుతున్నాడు.

సోసల్ మీడియాలో ఇంత పాపులర్ అయిన డొనాల్డ్‌సన్ ఇప్పుడు తన 26వ పుట్టినరోజున తన ఫాలోవర్స్‌తో కలిసి సెట్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. తనకు ఇంత పాపులారిటీ ఇచ్చిన వారికి గిఫ్ట్‌లు ఇవ్వాలని ప్లాన్ చేశాడు. అందులో బాగంగానే టెస్లాకార్లను గిఫ్ట్‌గా ఇస్తానని పోస్ట్ పెట్టాడు. తన ఏజ్ ఎంతో అన్ని కార్లను బహుమతిగా ప్రకటించాడు. ఆ కార్ల ఫోటోను కూడా పోస్ట్‌కు జత చేశాడు మిస్టర్ బీస్ట్.

View this post on Instagram

A post shared by MrBeast (@mrbeast)

Also Read:Elections 2024: ప్రచారాలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..ఇక నాలుగురోజులే

Advertisment
Advertisment
తాజా కథనాలు