Drone in Tirumala: నిన్నటి డ్రోన్ సీజ్ చేశాము : టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తిరుమలలో నిన్న (గురువారం) హర్యానాకు చెందిన భద్రత అధికారి దినేష్ ఎగరవేసిన డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. దినేష్‌కు అవగాహన లేకపోవడంతోనే ఆయన డ్రోన్‌ను ఎగరవేసినట్లు చెప్పారు. By B Aravind 13 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి నిన్న (శుక్రవారం) తిరుమలలో హర్యానాకు చెందిన దినేష్ కుటుంబ సభ్యులు డ్రోన్ ఎగరవేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ స్పందించారు. ఘాట్ రోడ్డులో నిన్న ఎగరవేసిన డ్రోన్‌ను సీజ్ చేశామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ను ఎగరవేసిన దినేష్‌ను విచారించినట్లు చెప్పారు. భద్రతా అధికారి అయిన దినేష్ రెండు నెలలుగా సెలవుల్లో సౌత్ ఇండియాలో పర్యటిస్తున్నారని.. ఈ క్రమంలోనే ఆయన డ్రోన్ కెమెరాను తిరుమలకు తీసుకొచ్చినట్లు చెప్పారు. Also Read: పల్లెబాట పట్టిన పట్నం.. కిక్కిరిసిన బస్సులు, హోటళ్లు గురువారం శ్రీవారిని దర్శించుకున్నాక ఆయన.. మొదటి ఘాట్‌రోడ్డులో 53వ మలుపు వద్ద కారును ఆపి డ్రోన్ ఎగరవేసి వీడియో తీశారని తెలిపారు. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. చిన్న డ్రోన్ కావడంతో అలిపిరి స్కానింగ్ పాయింట్‌లో గుర్తించేందుకు వీలు కాలేదని తెలిపారు. అయితే దినేష్‌కు నిబంధనలు తెలియకపోవడం వల్లే ఆయన తిరుమలకు డ్రోన్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. తిరుమలకు ఉగ్రముప్పు ఉందని గతంలో నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే అలిపిరిలో టోల్‌గేట్ వద్ద మాత్రం తనిఖీలు నామమాత్రంగా చేస్తున్నారు. దీంతో గంజాయిని కూడా సరఫరా చేయడం, డ్రోన్లు ఎగరడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. Also Read: వైసీపీకి షాక్.. జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం..! #tirupathi #tirumala #ttd #drone-in-tirumala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి