చిరంజీవి మాట్లాడింది కరెక్టే.. ఆయన చిన్న వ్యక్తి కాదు: ఉండవల్లి చిరు చెప్పింది కరెక్టేనని, సినిమా ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదని అన్నారు. అయితే చిరంజీవి మాత్రం పిచ్చుక లాంటి వారు కాదని ఉండవల్లి పేర్కొన్నారు. చిరంజీవి ఒంటరిగా పోటీ చేసి 18 సీట్లు గెలిచారని, అలాంటి వ్యక్తి చిన్నవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆ రోజు గొంతు విప్పింది చిరంజీవే అని చెప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు ఉండవల్లి. ఆయన కారణంగానే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. By E. Chinni 09 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరు చెప్పింది కరెక్టేనని, సినిమా ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదని అన్నారు. అయితే చిరంజీవి మాత్రం పిచ్చుక లాంటి వారు కాదని ఉండవల్లి పేర్కొన్నారు. చిరంజీవి ఒంటరిగా పోటీ చేసి 18 సీట్లు గెలిచారని, అలాంటి వ్యక్తి చిన్నవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆ రోజు గొంతు విప్పింది చిరంజీవే అని చెప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు ఉండవల్లి. విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం పట్టుబట్టింది చిరంజీవే అని, కేంద్ర మంత్రి హోదాలో గట్టిగా మాట్లాడింది ఆయనేనని తెలిపారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చిరు పట్టుబట్టారని, ఆయన కారణంగానే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఉండవల్లి గురించి మాట్లాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తి కాదన్నారు. పోలవరం అసలు ముందుకు కదలడం లేదని, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే టీడీపీ, వైపీపీ కాకుండా మరో పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. పోలవరం పూర్తి అవుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదని వ్యాఖ్యానించారు. ఏపీ కంటే తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో ముందు వరుసలో ఉందని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్లే ఇది సాధ్యమైందని ఉండవల్లి పేర్కొన్నారు. కాగా మరోవైపు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానులు ఆందోళనల బాట పట్టారు. ఎక్కడి ఎక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, అమర్నాథ్, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి చేస్తున్న కృషి ఎవరు చేయలేదన్నారు. సినీ పరిశ్రమ కోసం జగన్ ను కలిసినప్పుడు ఆయనను అవమానపరిచినా మౌనంగా ఉన్న వ్యక్తి చిరంజీవి అని పేర్కొన్నారు. చిరుపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. #chiranjeevi #ycp-government #megastar-chiranjeevi #vundavalli-arun-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి