ఆంధ్రప్రదేశ్ వైసీపీ సర్కార్‌కు అప్పుల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదు: పురంధేశ్వరి వైసీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి అప్పుల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదని మండిపడ్డారు. ఒక్క పరిశ్రమ లేదు, ఉద్యోగం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: ఎమ్మెల్యే కోటా ద్వారా తిరుమల శ్రీవారి దర్శనాలు పెంచిన ప్రభుత్వం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించారు. By Vijaya Nimma 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏపీ క్రైమ్ కి అడ్డాగా మారిపోయింది.. సీఎం పదవికి రెడీగా ఉన్నాను: పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ సహజ వనరుల దోపిడీ ఎక్కువ జరిగిందని.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రపై వారికున్నది ప్రేమ కాదు.. రాజధాని పెట్టి వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోనే ఎక్కువ క్రైమ్ రేట్ ఉందని.. ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే.. వీరు చేసిన తప్పులు అన్నింటిని బయటకు తీసుకొస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోడానికి.. సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Raghuram krishna raju: రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు: ఎంపీ రఘురామ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై, మంత్రులు రోజా, అమర్నాథ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రుషికొండపై జగన్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధం లేకుండా.. అక్రమ నిర్మాణాలు చేపడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెస్ట్ హౌస్ లను వేరొకరి పేరు మీద పెట్టి.. 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి.. జగన్ దంపతుల సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఎంపీ రఘురామ. అలాగే పర్యాటకం ముసుగులో ముఖ్యమంత్రి ఇల్లు, వ్యక్తిగత అవసరాల కోసం కార్యాలయన్ని కడుతున్నారని విమర్శించారు. రుషి కొండలో కడుతున్న గెస్ట్ హౌస్ లను జగన్ దంపతులు సొంతం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్మాణాలను అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘురామ. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ సర్కార్ నీరు గారుస్తోంది: చంద్రబాబు ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై.. యుద్ధభేరి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 9వ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ ను చంద్రబాబు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నీరు గారుస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ వల్ల ఎన్నో నీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అవే పూర్తి అయి ఉంటే.. ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతంగా ఉండేదన్నారు చంద్రబాబు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరంజీవి మాట్లాడింది కరెక్టే.. ఆయన చిన్న వ్యక్తి కాదు: ఉండవల్లి చిరు చెప్పింది కరెక్టేనని, సినిమా ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదని అన్నారు. అయితే చిరంజీవి మాత్రం పిచ్చుక లాంటి వారు కాదని ఉండవల్లి పేర్కొన్నారు. చిరంజీవి ఒంటరిగా పోటీ చేసి 18 సీట్లు గెలిచారని, అలాంటి వ్యక్తి చిన్నవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆ రోజు గొంతు విప్పింది చిరంజీవే అని చెప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు ఉండవల్లి. ఆయన కారణంగానే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారు: ఎంపీ రఘురామ వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కానీ.. సినిమా వాళ్ల గురించి మీకెందుకు అని బాగా గడ్డి పెట్టారని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ వైసీపీ సర్కార్ కి బుద్ధి వచ్చేలా మాట్లాడారని.. చిరంజీవి మాటలు ప్రశంసనీయం అంటూ కొనియాడారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అలాగే పలు అంశాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు రఘురామ. వలంటీర్ల అరాచకాలు ఎక్కువయ్యాయని.. వలంటీర్లకు నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn