ఆంధ్రప్రదేశ్ చిరంజీవి మాట్లాడింది కరెక్టే.. ఆయన చిన్న వ్యక్తి కాదు: ఉండవల్లి చిరు చెప్పింది కరెక్టేనని, సినిమా ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదని అన్నారు. అయితే చిరంజీవి మాత్రం పిచ్చుక లాంటి వారు కాదని ఉండవల్లి పేర్కొన్నారు. చిరంజీవి ఒంటరిగా పోటీ చేసి 18 సీట్లు గెలిచారని, అలాంటి వ్యక్తి చిన్నవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆ రోజు గొంతు విప్పింది చిరంజీవే అని చెప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు ఉండవల్లి. ఆయన కారణంగానే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn