Unda Valli Arun Kumar : వైసీపీలోకి ఉండవల్లి...క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ

రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్‌ ఓటమితో ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

New Update
undavalli arunkumar

undavalli arunkumar

Unda Valli Arun Kumar : రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSR Congress Party)లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న ఉండవల్లి గతంలో జగన్ కూ, చంద్రబాబుకు మద్దతుగా పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం జగన్‌ ఓటమిపాలవ్వడంతో ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

అయితే వచ్చే ఎన్నికల్లో జగన్‌ తిరిగి పట్టుసాధిస్తాడని, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి జగన్‌తో కలిసి పనిచేస్తాడని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఉండవల్లి ఇవాళ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టంపై పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇవాళ మీడియా సమావేశం పెట్టిన ఆయన.. వైసీపీలో తన చేరికపైనా స్పష్టత ఇచ్చారు. రాజకీయాలనుంచి కావాలనే తాను రిటైర్మెంట్ తీసుకున్నానని ఉండవల్లి వెల్లడించారు. తాను ఏ పార్టీలోకి వెళ్ళనని, తనకు అంత ఓపిక కూడా లేదని తెలిపారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని ఉండవల్లి తేల్చిచెప్పేశారు.

Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

దీంతో ఉండవల్లి జగన్‌తో జతకడుతాడని జరుగుతున్న ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది.వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరమయ్యాక చాలా మంది రాజకీయ నేతల్ని కలుస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే విపక్షంలో ఉండగానే పవన్ కళ్యాణ్ తో కలిసి ఏపీ విభజన అంశాలపై కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన హామీలపై చర్చలు జరిపారు. అయితే జగన్, చంద్రబాబు విషయంలో మాత్రం ఉండవల్లి పలు స్టాండ్స్ మార్చారు. కానీ తాజాగా జగన్ గతంలో తన తండ్రితో కలిసి పనిచేసిన నేతలతో సంప్రదింపులు జరిపి వారిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఉండవల్లి కూడా ఉన్నారనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. అయితే ఇవాళ ఉండవల్లి మాత్రం తాను ఏ పార్టీలో చేరడం లేదని చెప్పేయడంతో జగన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

Also Read: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్

జగన్ కు ఉండవల్లి సలహ..

అయితే ఇటీవల జగన్ కు ఉండవల్లి ఒక సలహ కూడా ఇచ్చాడు. 11 స్థానాలే గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. కరుణానిధికి ఏడు స్థానాలు వచ్చిన, జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేసారు. అయినా, వారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్దవంతంగా పోషిస్తే అలాంటి అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: అశ్లీల కంటెంట్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Advertisment
Advertisment
Advertisment