Pakistan : పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు వేసిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌లో ఈరోజు (గురువారం) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పీపీఈ, పీటీఐ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. By B Aravind 08 Feb 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Pakistan Voting : పాకిస్థాన్(Pakistan) లో గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఓటింగ్(Voting) మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 90 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికలు జరగనున్న వేళ.. ఇటీవల అక్కడ పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం దుమారం రేపాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం..! అయితే ప్రస్తుతం అక్కడ ఉగ్రదాడి ముప్పు పొంచి ఉండటంతో.. దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను(Mobile Internet Services) నిలిపివేస్తున్నట్లు హోంశాఖ ప్రతినిధి తెలిపారు. మరోవైపు పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ దీన్ని ఖండించింది. ప్రభుత్వం నుంచి ఆంక్షలు విధించాలని తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పింది. ఇంటర్నెట్ సేవలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడిన్లు సమాచారం. Also Read : BIG BREAKING : కోడికత్తి కేసులో శ్రీనుకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు PPE VS PTI ఇదిలాఉండగా.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓవైపు నవాజ్ షరీఫ్ నేతృత్వంలో పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్, బిలావల్ భుట్టో నాయకత్వంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPE).. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలో పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(PTI) మధ్యే గట్టి పోటీ ఉండనుంది. అయితే ప్రస్తుతం అవినీతి కేసుల్లో ఇరుక్కుని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. అలాగే పీటీఐ పార్టీ బ్యాట్ గుర్తుపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. దీంతో షరీఫ్‌కు చెందిన పీఎంఎల్ (ఎన్).. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించే ఛాన్స్ కనిపిస్తోంది. ఓటు వేసిన ఇమ్రాన్ ఖాన్ కానీ ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవచ్చని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన.. పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేసినట్లు పాకిస్థాన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. కానీ ఆయన భార్య బుష్రా బీబీ మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. తోషాఖానా కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.అయితే అప్పటికే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగిసిపోవడంతో ఆమె ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. Also Read : Balakrishna: బినామీల పేరుతో 214 ఎకరాలు.. కస్టడీలో కీలక వివరాలు #telugu-news #pakistan-news #pakistan-elections #pakistan-voting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి