Vishal: పబ్లిసిటీ కోసం దిగజారిపోవద్దు.. త్రిషను కామెంట్స్ చేసినవారిపై విశాల్ సీరియస్!

త్రిషపై రాజకీయవేత్త ఏవీరాజు చేసిన వ్యాఖ్యలను నటుడు విశాల్ ఖండించారు. సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్స్‌ చేయడం కొందరికి ట్రెండ్‌ గా మారిందని విమర్శించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పేరు సంపాదించాలనుకోవడం హుందాతనం కాదంటూ చురకలంటించారు.

New Update
Vishal: పబ్లిసిటీ కోసం దిగజారిపోవద్దు.. త్రిషను కామెంట్స్ చేసినవారిపై విశాల్ సీరియస్!

Trisha: ప్రముఖ రాజకీయవేత్త ఏవీ రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ నటి త్రిష సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రిష పై అభ్యంతరకరంగా కామెంట్స్ చేయడంపై ఫిలిం ఇండస్ట్రీలో అందరూ మండిపడుతున్నారు. ఈ ఇష్యూపై నటుడు విశాల్ తనదైన స్టైల్ లో స్పందించారు. ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచేందుకు సినీ తారలతోపాటు పలువురు సెలబ్రిటీలపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేయడం ఒక ట్రెండ్‌ గా మారిందన్నారు. ఇలాంటి పాడు పనులు కాకుండా జీవితానికి ఉపయోగపడే ఉద్యోగం చేసుకోవాలంటూ ఏవీ రాజు పేరు ఎత్తకుండా చురకలంటించారు.

నిజంగా బాధగా ఉంది..
ఈ మేరకు విశాల్ మాట్లాడుతూ.. 'ప్రముఖులపై తప్పుడు ప్రచారం, నెగెటీవ్ కామెంట్స్‌ చేయడం కొందరికీ ఒక ట్రెండ్‌ గా మారింది. ఏదైనా జాబ్ చేసుకోవాలి కానీ ఇలాంటి కామెంట్స్ చేస్తూ పేరు సంపాదించాలనుకోవడం సరైనది కాదు. ఒక రాజకీయ పార్టీకీ చెందిన వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన వారిపై ఆరోపణలు చేశారని విన్నాను. అది పబ్లిసిటీ కోసమే అని బాగా తెలుసు. ఇలాంటి వాటిపై మాట్లాడుతున్నందుకు నిజంగా బాధగా ఉంది. మీరు టార్గెట్‌ చేసినవారు.. నేనూ ఒకే సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లం. మంచి స్నేహితులం. అందుకే మీ పేరు, మీ ఆరోపణలు, వివరాలను ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఒకరి పర్సనల్ లైఫ్ పై కాంట్రవర్సీ గా మాట్లాడినందుకు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని క్షమించాలని కోరుతున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కాదు ఒక మనిషిగా చెబుతున్నా' అంటూ విశాల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

ఇది కూడా చదవండి: Singareni: సింగ‌రేణిలో ఉద్యోగాలకు నోటిఫికేష‌న్లు వేయండి.. భ‌ట్టి విక్రమార్క ఆదేశాలు

అసలేం జరిగిందంటే..
ఒక కార్యక్రమంలో ఏవీ రాజు త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయగా.. త్రిష ఖండించింది. 'అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూడటం అసహ్యంగా అనిపిస్తుంది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ సారి సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వస్తుంది' అంటూ ట్వీట్ చేస్తూ అతన్ని హెచ్చరించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

పహల్గాం ఉగ్రదాడి పై టాలీవుడ్‌ ప్రముఖులు స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.మెగాస్టార్‌ చిరంజీవితో పాటు, తారక్‌,చరణ్‌, బన్నీ వంటి వారు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.

New Update
tollywood

tollywood

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్ అందాలు చూడడానికి వచ్చిన పర్యాటకుల మీద ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారు. ప్రజల మీద పాశవికంగా దాడి చేశారు. ఆ ఘటనలో మొత్తం 28 మంది మరణించారు. ఈ విషాదం పట్ల  టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ సంతాపాన్ని తెలియజేశారు.

''పహల్గం లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రదాడి‌ అత్యంత దారుణమైన చర్య. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి కలిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది'' అని చిరంజీవి పేర్కొన్నారు. 

''పహల్గాం బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కి పోతుంది. ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

'పహల్గాం టెర్రర్ ఎటాక్ వార్త విని షాక్ అయ్యాను. ఎంతో బాధ కలిగింది. ఈ తరహా ఘటనలకు మన సమాజంలో చోటు లేదు. దీనిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలి. బాధిత కుటుంబాల కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

''పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ వార్త విని నా హృదయం ముక్కలైంది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా'' అని అల్లు అర్జున్ పోస్టు చేశారు. సాయి దుర్గా తేజ్, విష్ణు మంచు సహా పలువురు తెలుగు సినిమా ప్రముఖులు...‌‌ బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సంజయ్ దత్, జాన్వీ కపూర్, సోనూ సూద్ తదితరులు ఈ దాడిని ఖండించారు.

Also Read: Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!

Also Read: Pahalgam Attack: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

tollywood | Pahalgam attack | latest-news | jr-ntr | telugu-news

Advertisment
Advertisment
Advertisment