Virat Kohli Daughter : లండన్‌లో కూతురుతో విరాట్ కోహ్లీ... వైరల్ అవుతున్న ఫోటో

విరాట్-అనుష్క కూతురు వామికా ఎలా ఉంటుందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. తమ పిల్లల విషయంలో గోప్యత పాటిస్తున్నారు విరుష్క దంపతులు. అయితే తాజాగా లండన్‌లో విరాట్, వామికా ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అదికాస్తా వైరల్‌గా మారింది.

New Update
Virat Kohli Daughter : లండన్‌లో కూతురుతో విరాట్ కోహ్లీ... వైరల్ అవుతున్న ఫోటో

Virat Daughter Vamika Pic Goes Viral : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రస్తుతం లండన్‌(London) లో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్యనే విరుష్క(Veernushkie) దంపతులు రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. కొడుకు అకాయ్‌(Akai) కు అనుష్క్ లండన్‌లో జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో విరాట్ దంపతులు ఇంకా లండన్‌లోనే ఉన్నారు. అనుష్క్ డెలివరీలో కాంప్లికేషన్స్ ఉన్నాయని... అందుకే మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్నారని అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయంలో విరుష్క్ మాత్రం ఏమీ చెప్పడం లేదు. తాజాగా విరాట్ తన కూతురితో లండన్‌లో ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఫోటో బయటకు వచ్చింది. అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.

కూతురుతో టైమ్ స్పెండ్ చేస్తున్న విరాట్...
ప్రస్తుతం డెలివరీ తర్వాత అనుష్క్ తన మొత్తం టైమ్‌ను కొడుకు అకాయ్‌కే పెడుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి ఎప్పుడూ పక్కనే ఉండడం చాలా అవసరం. దీంతో ఆమె బిజీ అయిపోయారు. ఇదే సమయంలో విరాట్ తన కూతురితో ఎంజాయ్ చేస్తున్నారు. లండన్‌లో కూతురు వామికాను తిప్పుతూ సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్ళారు. అక్కడ లంచ్ చేస్తుండగా విరాట్, వాయికాలకు ఎవరో ఫోటో తీశారు. దాన్ని కాస్తా సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేశారు. అయితే ఇందులో కూడా వామికా(Vamika) మొహం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మొదట నుంచి తమ కుటుంబ వివరాలు, పిల్లల విషయాల్లో గోప్యత పాటిస్తున్నారు విరాట్, అనుష్కలు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలు వామికా ఇంతకు ముందుకన్నా కాస్త ఎక్కువగా కనిపిస్తుండడంతో విరాట్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు.

ఐపీఎల్‌కూ కష్టమే..
వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్ కూ దూరం కానున్నారు అనే వార్తలు వస్తున్నాయి. తాజాగా సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్ ద్వారా కూడా ఇది నిజమనే తెలుస్తోంది. అనుష్క మరికొన్నాళ్ళు లండన్‌లోనే ఉండాల్సి రావడం వల్ల విరాట్ ఐపీఎల్ ఫస్ట్ హాఫ్‌కు రాలేరని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు విరాట్ కానీ, ఆర్సీబీ యాజమాన్యం కానీ ప్రకటించలేదు.

Also Read : Telangana: తీవ్ర ఉద్రిక్తతగా బండి సంజయ్ ప్రజాహిత యాత్ర

Advertisment
Advertisment
తాజా కథనాలు