వాక్ వే అనుకొని లగేజ్ కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కి.. వీడియో వైరల్

విమానాశ్రయంలో ఓ వృద్ధురాలు వాక్ వే అనుకోని చెక్ ఇన్ ఏరియాలో లగేజ్ కన్వేయర్ బెల్ట్ ఎక్కింది. ఇది రష్యాలోని వ్లాదికావ్‌కాజ్ జరిగింది. కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కిన ముసలావిడ కిందపడి లగేజ్ తోపాటు బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

New Update
convey belt

convey belt Photograph: (convey belt)

ఎయిర్ పోర్ట్ చెక్ ఇన్ ఏరియాలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానాశ్రయంలో ఓ వృద్ధురాలు వాక్ వే అనుకోని చెక్ ఇన్ ఏరియాలో లగేజ్ కన్వేయర్ బెల్ట్ ఎక్కింది. ఈ ఘటన రష్యాలోని వ్లాదికావ్‌కాజ్ ఎయిర్ పోర్ట్‌లో చోటుచేసుకుంది. అయితే ఆ వృద్ధురాలు కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కి కిందపడిపోయింది. అక్కడి నుంచి ఆమె నేరుగా సెక్యూరిటీ చెకింగ్ బాక్స్ లోకి మాయమైంది. తర్వాత లగేజ్ బ్యాగ్స్‌తోపాటు బయటకు వచ్చింది. ఇదంతా లగేజ్ చెక్ ఇన్ కపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోలు ప్రసెంట్ ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 

Also Read: సైనిక్ స్కూల్ 2025 ఎంట్రన్స్ అప్లికేషన్ లాస్ట్‌డేట్ ఇదే.. వెంటనే అప్లై చేయండి

S7 ఎయిర్‌లైన్స్ విమానంలో ఆమె వ్లాదికావ్ కాజ్ నుంచి మాస్కోలోని డొమోడెడోవో ఎయిర్ పోర్ట్ కు వెళ్లాల్సి ఉంది. సెక్కురీటీ సిబ్బంది, మరో మహిళలతో మాట్లాడుతుండగా ఆవిడ కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కింది. ఆమె లగేజ్ కన్వయర్ బెల్ట్ పై పడిపోయి బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ సెక్కూరిటీ స్ర్కీనింగ్ బాక్స్ లోకి వెళ్లింది. అయితే ఆ ముసలావిడ కావాలనే లగేజ్ చెక్ ఇన్ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఆమె లగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ సెక్యూరిటీ స్క్రీనింగ్ ఎలా ఉంటుందో ఎక్స్ పీరియన్స్ చేయాలనుకుందట. ఈ వీడియోపై నెటిజన్లు వారి అభిప్రాయాన్ని కామెంట్ చేస్తున్నారు. 

Also read: లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు.. మంటల్లో ప్రియాంక చోప్రా ఇల్లు !

Advertisment
Advertisment
Advertisment