Metro: మెట్రోలో నో క్లాత్స్ ఓన్లీ టవల్.. అమ్మాయిలు ఇలా తయారయ్యారేంటి? మెట్రోలో దుస్తులు లేకుండా కేవలం వైట్ టవల్స్ ధరించిన నలుగురు యువతులు ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వీరిని చూసి అమ్మాయిలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఇలా చేస్తున్నారేంటని మండిపడుతున్నారు. By Kusuma 02 Dec 2024 | నవీకరించబడింది పై 02 Dec 2024 09:58 IST in వైరల్ Latest News In Telugu New Update షేర్ చేయండి సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కొందరు కొత్తగా రీల్స్ చేస్తున్నారు. ఈక్రమంలో కొందరు డేర్ చేసి స్టంట్స్ చేయడం, వెరైటీగా ఉండే దుస్తులు ధరిస్తు్న్నారు. ఇలానే కొందరు అమ్మాయిలు మెట్రోలో టవల్స్‌తో తిరిగిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది కూడా చూడండి: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్.. వైట్ టవల్స్‌ను చుట్టుకుని.. ఒక నలుగురు అమ్మాయిలు వైట్ కలర్ టవల్స్ కట్టుకుని, తలకి కూడా తెలుపు రంగులో ఉండే పాగా చుట్టుకుని ర్యాంప్ వాక్ చేసుకుంటూ మెట్రో స్టేషన్‌లో కనిపించారు. ఆ తర్వాత మెట్రోలో కూడా వారు ప్రయాణించారు. శరీరాన్ని కప్పుకోవడానికి ఎలాంటి దుస్తులు ధరించకుండా కేవలం వైట్ టవల్స్ మాత్రమే ధరించారు. View this post on Instagram A post shared by Kate Shumskaya (@mimisskate) ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా.. కొందరు అయితే వీరితో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో పలువురు వీరిపై మండిపడుతున్నారు. బాత్‌రూమ్‌లో ఉండాల్సిన విధంగా బయట ప్రపంచంలో మెట్రోలో ఉంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మర్చిపోయి బాత్‌రూమ్ నుంచి టవల్స్‌తో వచ్చినట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో చూస్తే మెట్రో మన దేశానికి చెందినట్లు లేదు. మరి ఏ దేశానికి చెందిన మెట్రోనో పూర్తిగా తెలియదు. ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రీల్‌పై పలువురు కూడా మండిపడుతున్నారు. పబ్లిక్‌లో ఇలా టవల్స్‌కి తిరగడమేంటని కొందరు అసహ్యహించుకుంటున్నారు. ఇలాంటివి చూసే చాలా మంది చెడు అలవాట్ల బారిన పడుతున్నారని అంటున్నారు. ఇలాంటి రీల్స్ చేసిన వారిపై మెట్రో కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చూడండి: పుష్ప-2పై టీడీపీ ఎంపీ ట్వీట్.. వెంటనే డిలీట్ #metro #women #viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి