ఒళ్ళు గగుర్పొడిచే వీడియో.. అర కిలోమీటర్ స్కూటర్ ని ఈడ్చుకెళ్ళిన కారు..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హైవే పై కారు స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో స్కూటర్ కారు బానెట్‌లో ఇరుక్కుపోయింది. అయినప్పటికీ కారు డ్రైవర్ పట్టించుకోకుండా అర కిలోమీటర్ వరకు స్కూటర్‌ను ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
car accident

car accident

Viral Video : ఈ మధ్య కొంతమంది ఆకతాయిలు రోడ్ల పై అడ్డుఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ లతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. పోనీ..  డ్యాష్ ఇచ్చిన తర్వాత గాయపడిన వ్యక్తిని కనీసం కాపాడాలనే మానవత్వం కూడా లేకుండా పోతుంది. ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది. హైవే పై స్పీడ్ గా వెళ్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది. ఆ తర్వాత బైక్ ను అర కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

స్కూటర్ కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు 

మీడియా కథనాల ప్రకారం.. లక్నోలోని పిజిఐ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యాక్సిడెంట్ జరిగింది. స్కూటర్ పై ఇద్దరు వ్యక్తులు మోహన్‌లాల్‌గంజ్‌కు వెళ్తుండగా వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కింద పడిపోయారు. ఈ క్రమంలో స్కూటర్ కారు బానెట్‌లో ఇరుక్కుపోయింది. అయినప్పటికీ కారు ఆపకుండా స్కూటర్ ను అర కిలోమీటర్ వరకు లాకెళ్ళాడు కారు డ్రైవర్. పక్కనే వెళ్తున్న వాహన దారులు చెబుతున్న వినిపించుకోకుండా అలాగే వెళ్ళాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును వెంబడించి అడ్డుకున్నారు. 

Also Read: నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్

Also Read :  భూపాలపల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం.. భయాందోళనలో గ్రామస్థులు

పోలీసులు కారు డ్రైవర్ ను ప్రయాగ్‌రాజ్‌కు చెందిన చంద్రప్రకాష్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన స్కూటర్‌ డ్రైవర్, మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

Also Read: నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్‌.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ లో నడుస్తున్న విషయం జిబ్లీ ట్రెండ్. తమ ఫోటోలను ఏఐ ద్వారా యానిమేషన్ లో మార్చుకుని మురిసిపోతున్నారు. కానీ ఈ ట్రెండ్ అంత మంచిది కాదని అంటున్నారు. వాటిని మిస్ యూజ్ చేయొచ్చని చెబుతున్నారు. 

New Update
ai

AI Jibli Trend

ఎక్కడ చూడు ఇప్పుడు ఇప్పుడు జిబ్లీ ఫోటోలే. రకరకాలుగా తమ ఫోటోలను మార్చుకుంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీని కోసం రీల్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. ఇన్స్టా, ఎక్స్ లు అయితే మొత్తం ఈ జిబ్లీ ట్రెండ్ తోనే నిండిపోయాయి. ఏఐ టూల్స్ దవారా మర ఒరిజినల్ ఫోటోలను యానిమేషన్ గా మార్చుకోవడమే జిబ్లీ. ఇందులో ఎక్కువ మంది వ్యక్తిగత లేది కుటుంబ ఫోటోలనే పెడుతున్నారు. అయితే ఈ వౌరల్ ట్రెండ్ తాజాగా ప్రైవసీకి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇంటర్నెట్ ఏఐ ఎక్స్ పర్ట్ ఏఏఐతో వ్యక్తిగత ఫోటోలను పంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు. డేటా ప్రైవసీ, సెక్యురిటీ మీద పనిచేసే ప్రోటాన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఎక్స్​ ద్వారా ఈ విషయాన్ని షేర్​ చేసింది. వ్యక్తిగత ఫొటోలను ఏఐ ఫ్లాట్​ఫామ్లో అప్​లోడ్​ చేసిన తర్వాత వాటిని ఏఐకి ట్రైనింగ్​ ఇవ్వడానికి ఉపయోగిస్తారు.

దేనికైనా ఉపయోగించొచ్చు..

అయితే తర్వాత కాలంలో ఏఐ మోడల్స్ మన ఫోటోలను వాడుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మర పోలికలతో ఉన్న ఫోటోలను మన అనుమతి లేకుండా ఉపయోగించే అవకాశం ఉందని..అప్పుడు వద్దని అనడానికి కూడా వీలు ఉండదని చెబుతున్నారు.  వాటిని మిస్ యూజ్ చేయోచ్చని హెచ్చరిస్తున్నారు. మనకు నచ్చని లేదా మన ప్రైవసీకి భంగం కలిగించే విధంగా లేదా పరువు తీసే విధంగా ఫోటోలను యూజ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆ ఫోటోలను డీప్ ఫేక్ లో వాడినా వాడొచ్చని అంటున్నారు. పైగా ఏఐ టూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫొటోలు, ఆలోచనలను పంచుకోవడం వల్ల మెటాడేటా, లొకేషన్​, సెన్సిటివ్​ డేటా బహిర్గతమయ్యే అవకాశం ఉందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

today-latest-news-in-telugu | chat gpt Ai | viral | trend
 

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

 

Advertisment
Advertisment
Advertisment