Mahakumbh Mela 2025: పాపం.. మోనాలిసాకు టార్చర్.. వీడియోలు వైరల్!

కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరలైన మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కుంభమేళాకు వచ్చిన యూట్యూబర్లు, నెటిజన్లు ఆమెను వ్యాపారం చేసుకోనివ్వకుండా సెల్ఫీలు, వీడియోల కోసం ఎగబడుతున్నారు. బతుకుదెరువు కోసం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులకు ఇది ఇబ్బందిగా మారింది.

author-image
By Archana
New Update
Monalisa

Monalisa

Monalisa: ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా ఉత్సవం ఘనంగా జరుగుతోంది. ప్రపంచనలుమూల నుంచి కోట్లాది భక్తులు త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కుంభమేళలో పూసలు అమ్ముకునే ఓ యువతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  నెటిజన్లు ముద్దుగా ‘బ్రౌన్ బ్యూటీ’ అని  పిలుచుకుంటున్న ఈ అమ్మాయి పేరు మోనాలిసా భోస్లే. నీలి రంగు కళ్లతో పూసలు దండలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి.. కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది. అయితే ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో ఒకటి అనుకోకుండా  వైరల్ కావడంతో.. సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెన్షేషన్‌గా మారింది. వీడియో ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. 

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

సెల్ఫీలతో టార్చర్.. 

దీంతో కుంభమేళాకు వచ్చిన నెటిజన్లు, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.  వ్యాపారం చేసుకోనివ్వకుండా  జనం సెల్ఫీల కోసం ఎగబడడం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది. ఆమెను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ, ఎక్కువమంది ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన కొందరు నెటిజన్లు..  ''బ‌త‌కుదెరువు కోసం వస్తే.. ఇలా చేస్తారా? పేదింటి బిడ్డ‌పై ఈ అరాచ‌కం ఏంటి?'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా జనాలు గుమిగూడి సెల్ఫీల కోసం ఎగబడడంతో వారి వ్యాపారం బాగా దెబ్బతిందట. దీంతో మోనాలిసను ఆమె తండ్రి ఇంటికి పంపించారట.

 

Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు