Ghibli Images: కొంపముంచే ఘిబ్లీ ట్రెండ్.. ఈ ఫొటోస్ ఎంత ప్రమాదమో తెలుసా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఘిబ్లి ఇమేజ్ ట్రెండింగ్ నడుస్తోంది. నెటిజన్లు ఫొటోస్‌తో ఏఐని వాడి కర్టూన్ తయారు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్‌లో మీ ఫేస్ ఐడెంటిటీ, డిటేల్స్ దొంగలించే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Ghibli stealing your face

Ghibli stealing your face Photograph: (Ghibli stealing your face)

Ghibli Images: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఘిబ్లీ ట్రెండ్ ఫుల్ వైరల్ అవుతుంది. మీ ఫోటో చాట్ జీపీటీ ఏఐకి ఇస్తే అది దాన్ని కాటూన్‌లా మార్చి అందిస్తుంది. దీంతో నెటిజన్లు వారి ఫొటోస్‌తోపాటు ఫ్యామిలీ ఫొటోస్‌ కూడా ఘిబ్లీ ఇమేజ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లో ఎక్కడ చూసినా ఘిబ్లీ ఫొటోసే. ఘిబ్లీ ఇమేజ్ కోసం మీ ఫొటోస్ ఏఐలో అప్లోడ్ చేయడం చాలా ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఘిబ్లీ ఫొటోస్ క్రియేట్ చేసుకోవడం అంటే మీ వేలుతో మీ కంట్లో పొడుచుకున్నట్లే అని సైబర్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.

Also Read: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు!

మీ ఫేస్ ఐడెంటిటీని మీఅందట మీరే ఇతరులకు అప్పగిస్తున్నారని వారు వాపోతున్నారు. దీని ద్వారా భవిష్యత్‌లో ఆ ఫోటోలను దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉంటాయని కొందరు టెక్ ప్రముఖులు చెబుతున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలూ జరిగాయి. 2024 మేలో ఆస్ట్రేలియన్ కంపెనీ ఔటాబాక్స్ డేటా లీక్ అయింది. దీనిలో 1.05 మిలియన్ల మంది ఫేస్ స్కాన్ ఐడెంటిటీ, డ్రైవింగ్ లైసెన్స్‌లు, అడ్రస్ ఫ్రూఫ్‌లు దొంగలించారు. వారి డేటాను హేవ్ ఐ బీన్ ఔటాబాక్స్డ్ అనే సైట్‌లో ఉంచారు. అంతేకాదు ఘిబ్లీ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మీరు అప్‌లోడ్ చేసిన ఫోటోస్‌తో డీఫ్‌ఫేక్ వీడియోలు చేసిన మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామంది OpenAI యొక్క ChatGPT 4oతో డబ్బులు చెల్లించి మరీ ఘిబ్లీ ఇమేజ్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు. లక్షల రూపాయలు పోగుచేసుకుంటున్న కంపెనీలకు మీ అంతట మీరే.. మీ డేటా, ఫోటోస్ వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. 2021లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (FRT) మార్కెట్ 5.01 బిలియన్ డాలర్లు ఉండగా, ఇది 2028 నాటికి 12.67 బిలియన్ డాలర్లుకు చేరుకుంటుందని అంచనా. మెటా, గూగుల్ వంటి కంపెనీలు వినియోగదారుల ఫోటోలను ఉపయోగించి వారి AI మోడళ్లకు శిక్షణ ఇస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మీ ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉంది. ఫ్యూచర్‌లో మీ ఫోటోని వాడి మీ వివరాలు అన్నీ సేకరించవచ్చు. టెక్నాలజీ అంత డెవలప్‌అవుతుంది. గతంలో క్లియర్‌వ్యూ AI సోషల్ మీడియా, వార్తల సైట్‌లు, పబ్లిక్ రికార్డుల నుంచి అనుమతి లేకుండా 3 బిలియన్ల ఫోటోలను దొంగిలించింది. వాటిని పోలీసులు, ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడం ద్వారా డేటాబేస్‌ను సృష్టించిందని ఆరోపణలు ఎదుర్కోంది. ఘిబ్లి ఫొటోస్ క్రియేట్ చేసుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కు ఈ విషయాన్ని షేర్ చేయండి. పెద్ద ప్రమాదం నుంచి వారిని కాపాడండి. ఘిబ్లి ఇమేజ్‌లు ఎంత ప్రమాదమో వారికి తెలియజేయండి.

Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు