/rtv/media/media_files/2025/03/12/wuO3t5GKWMWi8s2AGPc5.jpg)
India Is Better Than USA, Video Viral
ఆధునికతలో ముందుండే అమెరికా కంటే భారత్ చాలా ముందుంది అంటున్నారు అమెరికాకు చెందిన ఓ మహిళ. ఎంతో మంది యూఎస్ లో ఉండాలని కలలు కంటారు కానీ...ఇండియా అమెరికా కంటే పది విషయాల్లో బెటర్ అని చెబుతున్నారు. వాటి వివరాలను వీడియోగా చేసి రూపొందించారు కూడా. అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ సోషల్ మీడియా పెట్టిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. భారతదేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న సౌకర్యాలు అమెరికాలో ఉండాలో ఆమె వివరించింది.
యూపీఐ దగ్గర నుంచి రిక్షా వరకూ...
ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ చాలా బావుంటాయని అంటున్నారు క్రిస్టెన్. ఇక్కడ యూపీఐ చెల్లింపులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పారు. తాను ఇండియాలో ఎక్కడకు వెళ్ళినా ఫోన్ తో మాత్రమే బయటకు వెళతానని...దాని ద్వారానే చెల్లింపులన్నీ చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రపంచం మొత్తం దీన్ని అమలు చేస్తే బావుంటుందని అన్నారు. అలాగే భారత్ ఆటో, రిక్షాలుఅంటే కూడా చాలా ఇస్టమని చెబుతున్నారు క్రిస్టెన్. ఇవి చాలా చవకే కాకుండా మంచి రవాణా వ్యవస్థ అని అన్నారు. అమెరికా ఇలాంటి వేగవంతమైన, చవకైన రవాణా ఎంపికలు ఉండవని చెప్పారు.
వైద్య విధానం...
భారత్ లో మరో చెప్పుకోదగ్గ అంశం వైద్య విధానం అని అంటున్నారు క్రిస్టెన్. ఇక్కడ డాక్టర్లు సులభంగా అందుబాటులో ఉంటారని, కొన్నిసార్లు అపాయింట్‌మెంట్ లేకుండా కూడా వారు అందుబాటులో ఉంటారని అన్నారు. అలాగే ఇండియాలో ఉన్న డెలివరీ యాప్ లు కూడా చాలా ఆశ్చర్యపరిచాయని చెప్పారు. ఇంత సులభంగా, అందుబాటు డెలివరీ యాప్ లు ఉండడం అమెరికాలో సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. దానికి తోడు భారత్ లో MRP వ్యవస్థ కారణంగా, ప్రతి ఉత్పత్తిపై గరిష్ట రిటైల్ ధర ముద్రించబడుతుంది.. ఇది మోసానికి అవకాశం లేకుండా చేస్తుంది. అలాగే భారతదేశంలో ఉచిత ప్రభుత్వ చెత్త పారవేయడం సేవ అందుబాటులో ఉంది, అయితే అమెరికాలో దీని కోసం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. క్రిస్టీనా పెట్టిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. కొంత మంది ఆమె చెప్పిన వాటికి యెస్ అంటుంటే...మరి కొందరు మాత్రం భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను, పెద్ద సమస్యలను ెత్తి చూపించారు.