Pawan Kalyan : శివరాత్రి స్పెషల్‌ వీడియో... ఉపవాసం, జాగరణ చేసిన పవన్‌ పిల్లలు.. వీడియో వైరల్‌!

తాజాగా శివరాత్రి సందర్భంగా రేణు దేశాయ్‌ ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో అకిరా ,ఆద్య ఇద్దరు కూడా రాత్రంతా యోగా ముద్రలో కూర్చుని సద్గురు లైవ్‌ ని చూస్తు ఓం నమఃశివాయ అంటూ శివయ్య నామ స్మరణ చేశారని, వారు రోజంతా ఉపవాసం ఉన్నట్లు తెలిపారు.

New Update
Pawan Kalyan : శివరాత్రి స్పెషల్‌ వీడియో... ఉపవాసం, జాగరణ చేసిన పవన్‌ పిల్లలు.. వీడియో వైరల్‌!

Shivaratri Special Video : పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan), రేణు దేశాయ్(Renu Desai)  లు విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నప్పటికీ వారి పిల్లలు మాత్రం మెగా ఫ్యామిలికి దగ్గరగానే ఉంటున్నారు. మెగా ఫ్యామిలీలో ఏ చిన్న కార్యక్రమం అయినా వీరిద్దరూ కచ్చితంగా హాజరవుతారు. వీరి గురించి ఏ విషయం బయటకు వచ్చినా అది వైరల్‌ గా మారుతుంది.

తాజాగా శివరాత్రి(Shivaratri) సందర్భంగా రేణు దేశాయ్‌ పిల్లలు ఇద్దరి గురించి ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో అకిరా(Akira Nandan) , ఆద్య(Adhya)  ఇద్దరు కూడా యోగా ముద్రలో కూర్చుని సద్గురు లైవ్‌ ని చూస్తు ఓం నమఃశివాయ అంటూ శివయ్య నామ స్మరణ చేస్తున్నారు.
దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు వారిద్దరిని తెగ పొగిడేస్తున్నారు.

సంక్రాంతి సమయంలో కూడా ఆద్య , అకీరా మెగా ఫ్యామిలీతో కలిసి ఉన్న చిత్రాలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరు రేణు దేశాయ్ దగ్గర ఉన్నప్పటికీ కచ్చితంగా ప్రతి మెగా ఈవెంట్ కు హాజరవుతారు. వీరి గురించి ప్రతి చిన్న విషయాన్ని కూడా రేణు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

దీంతో వీరిద్దరి గురించి అభిమానులకు ప్రతి విషయం తెలుసు. తాజాగా రేణు దేశాయ్‌ శివరాత్రి రోజు అకిరా, ఆద్య ఉపవాసం ఉండి, జాగరం చేసిన వీడియోను షేర్‌ చేసింది. రాత్రి అంతా కూడా పిల్లలిద్దరూ సద్గురు లైవ్‌ షో చూస్తూ ఓం నమః శివాయ(Om Namah Shivaya) అంటూ దైవ నామ స్మరణ చేశారని వెల్లడించింది.

దీనిని వీడియో తీసిన రేణు ఇద్దరు కూడా ఎంతో భక్తి శ్రద్దలతో ఉపవాసం, జాగరం చేశారని వివరించింది. పేరెంట్స్ గా ప్రతి బిడ్డకు మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించాలని ఈ సందర్భంగా రేణు అన్నారు. చిన్నతనంలో పిల్లలకు ఏది నేర్పుతామో పెద్దవారు అయిన తరువాత కూడా వారు అదే పాటిస్తారని రేణు చెప్పుకొచ్చింది.

శివరాత్రి రోజు ఉదయం నుంచి పిల్లలిద్దరూ కేవలం మంచి నీరు తాగి మాత్రమే ఉన్నారని, నేను మెడిసిన్‌ తీసుకోవాలి కాబట్టి టిఫిన్‌ చేసినట్లు రేణు దేశాయ్‌ చెప్పింది. ఈ వీడియో చూసిన వారంతా రేణు దేశాయ్‌ ని తెగ పొగిడేస్తున్నారు. పిల్లలను మంచి పద్దతిలో పెంచుతున్నారని కితాబు ఇస్తున్నారు.

Also Read : తల్లి కోసం చెఫ్‌ గా మారిన మెగా పవర్‌ స్టార్‌!

#pawan-kalyan #adhya #actress-renu-desai #akira-nandan #maha-shivaratri
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Manchu war: మా అన్న పెద్ద దొంగ.. విష్ణుపై నార్సింగ...

Manchu war: మా అన్న పెద్ద దొంగ.. విష్ణుపై నార్సింగి పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు!

మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు చెలరేగాయి. మంచు విష్ణు అనుచరులు తన కారుతో పాటు కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్‌పల్లిలోని తన ఇంట్లో 150 మందితో విధ్వంసం సృష్టించారని తెలిపారు.

New Update
manchu manoj case on brother manchu vishnu

manchu manoj case on brother manchu vishnu

Manchu Family Fight: గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.  అయితే తాజాగా మరోసారి మంచు బ్రదర్స్  విభేదాలు రచ్చకెక్కాయి. మనోజ్ అన్న విష్ణు పై దొంగతనం కేసు పెట్టడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  విష్ణు అనుచరులు తన కారుతో కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్‌పల్లిలోని తన నివాసంలో 150 మందితో విధ్వంసం సృష్టించారని, విలువైన వస్తువులను దొంగలించారని తెలిపారు. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

ముదురుతున్న వివాదం 

ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ లో మొదలైన మంచు ఫ్యామిలీ వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప.. ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలోని  మోహన్ బాబు  ఫామ్ హౌస్ ఆస్తుల విషయంలో మనోజ్, విష్ణు వివాదం మొదలైంది. నాలుగు గోడల మధ్య చిన్నగా మొదలైన ఈ వివాదం చివరికి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది.  తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణుతో మనోజ్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. ప్రస్తుతానికి జల్ పల్లి ఆస్తుల వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు. 

telugu-news | cinema-news | latest-news | manchu family fight | manchu family controversy 

Also Read: Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

Advertisment
Advertisment
Advertisment