/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-20T213032.955.jpg)
సోషల్ మీడియాలో రీల్స్ మోజులో పడి కొందరు యువతీ, యువకులు పాపులరిటీ దక్కించుకోవడం కోసం ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు. అయితే తాజాగా ఓ యువతి కూడా ఒక పిచ్చి స్టంట్ చేసింది. పరిస్థితి కొంచెం అటూ ఇటూ అయ్యి ఉంటే ఉంటే ఆమె ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చి ఉండేది.
Also Read: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్..
ఇక వివరాల్లోకి వెళ్తే.. పుణెలోని స్వామి నారాయణ్ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఎత్తైన భవనం నుంచి ఒక యువతి కిందకి వేలాడుతూ కనిపించింది. మరో యువకుడు పైనుంచి తన చేయిని పట్టుకున్నాడు. ఆ చేయి ఏ కొంచెం పట్టు జారినా ఆమె కిందపడిపోయి ప్రాణాలతో కోల్పోయేది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా రీల్ చేసిన టీనేజర్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్
#Pune: For Creating Reels and checking the strength, Youngsters risk their lives by doing stunt on an abandoned building near Swaminarayan Mandir, Jambhulwadi Pune@TikamShekhawat pic.twitter.com/a5xsLjfGYi
— Punekar News (@punekarnews) June 20, 2024