Meta Layoffs: ఏఐ ఎఫెక్ట్.. మెటాలో భారీగా లేఆఫ్‌లు

ముఖ టెక్ దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని వివిధ విభాగాల నుంచి సుమారుగా 700 మంది ఉద్యోగులపై వేటు విధించింది. ముఖ్యంగా రియాలిటీ ల్యాబ్స్, సేల్స్, రిక్రూటింగ్, ఫేస్‌బుక్ విభాగాల్లో లేఆఫ్‌లు జరిగాయి.

New Update
Meta company

Layoffs

ప్రస్తుతం కృత్రిమ మేధ వల్ల అన్ని రంగాల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ప్రముఖ టెక్ దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని వివిధ విభాగాల నుంచి సుమారుగా 700 మంది ఉద్యోగులపై వేటు విధించింది. ముఖ్యంగా రియాలిటీ ల్యాబ్స్, సేల్స్, రిక్రూటింగ్, ఫేస్‌బుక్ విభాగాల్లో లేఆఫ్‌లు జరిగాయి. రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో రెండోసారి ఈ ఏడాదిలో తొలగించడం జరిగింది. అంతకు ముందు వెయ్యి మంది ఉద్యోగులను ఈ విభాగం నుంచి తొలగించింది. అయితే అన్ని విభాగాలను కలిపి మొత్తం 16 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లుతెలుస్తోంది. మెటా ఏఐ రంగంలో తమ పెట్టుబడులను భారీగా పెంచుతోంది. ఈ క్రమంలోనే ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగస్తులను తొలగించినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!

ఇది కూడా చూడండి: ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్

భారీ బహుమతులు..

మెటా సంస్థ ఒకవైపు నుంచి ఉద్యోగులను తొలగిస్తూనే.. మరోవైపు సంస్థలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు మెటా భారీ బహుమతులు ప్రకటించింది. లేఆఫ్స్ ప్రకటించడానికి కేవలం కొన్ని గంటల ముందే కీలక అధికారుల కోసం కొత్త స్టాక్ ఆప్షన్లను కంపెనీ ప్రకటించింది. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో సీనియర్ అధికారుల వేతన ప్యాకేజీలు భారీగా పెరగనున్నాయి. దీని విలువ సుమారు 921 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 8,600 కోట్లు అన్నమాట. ఏఐ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన ఉన్నతాధికారులు వేరే సంస్థలకు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికే ఈ భారీ ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Vande Bharat Express: పెరుగులో పురుగులు.. ఇండియన్ రైల్వేస్‌కు భారీ జరిమానా

ఇది కూడా చూడండి: యుద్ధరంగంలోకి భారత్.. 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' ప్రారంభించిన ఇండియన్ నేవీ

Advertisment
తాజా కథనాలు