/rtv/media/media_files/2025/01/14/owf2JbChFXQM2QM9gXNr.jpg)
medals Photograph: (medals)
మోసం.. దగా.. కుట్ర.. విశ్వక్రీడలు ఒలింపిక్స్ విజేతలకు కల్తీ మెడల్స్. తినే తిండిలో కల్తీ, పీల్చే గాలిలో కల్తీ, ఆకరికి కష్టపడి ప్రతిభచాటిన వారికి ఇచ్చే బహుమతిలో కూడా కల్తీనా..? పతకాలు ఇచ్చి పది నెలలు కూడా కాలే.. అప్పుడే వాటి రంగు పోతుంది. 2024 జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు పారిస్ వేదికగా ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి. అందులో విజేతలకు 5,084 స్వర్ణం(గోల్డ్), రజత(సిల్వర్), కాంస్యం(బ్రౌంజ్) మెడల్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వాటిలో కొన్ని పతకాలకు మెటల్ కోటింగ్ పోతుంది. దాదాపు 100 పతకాలు దాకా పాడైపోయాయి. మెడల్స్‌పై లోహపు పూత ఊడిపోయి దారుణంగా తయారయ్యాయి. దీంతో పారిస్ ఒలింపిక్స్ పతకాలపై విమర్శలు వస్తున్నాయి.
అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటి లోపభూయిష్టమైయి మెడల్స్‌ను క్రీడాకారుల నుంచి తిరిగి తీసుకుంటుంది. వాటికి బదులు కొత్త పతకాలు ఇస్తామని తెలిపింది. ఫ్రెంచ్ గవర్నమెంట్ మాత్రం మెడల్స్ నాసిరకంగా ఉన్నాయని వస్తున్న విమర్శలను ఖండించింది. గత ఆగస్ట్ నుంచే మెటల్ కోటింగ్ పోయిన పతకాలను రిప్లేస్ చేస్తున్నామని చెప్పింది. ఇప్పటివరకు పాడైపోయిన 100 మెడల్స్‌ను తీసుకొని వాటి ప్లేస్‌లో కొత్తవి ఇచ్చామని లా లెట్రె పత్రికకు అక్కడి ప్రభుత్వం చెప్పింది. కొందరు అథ్లెట్లు సోషల్ మీడియాలో పాడైపోయిన మెడల్స్ ఫోటోలు పెడుతున్నారు. అమెరికాకు చెందిన స్కేట్ బోర్డర్ హుస్టన్ మెడల్స్ క్వాలిటీపై ఫిర్యాదు కూడా చేశారు.
🚨PARIS OLYMPICS 2024 MEDALS FALL APART—LITERALLY!
— Mario Nawfal (@MarioNawfal) January 13, 2025
The Paris 2024 Olympics’ medals are falling apart, with over 100 athletes returning them due to visible damage—particularly bronze medals.
One French swimmer described their medal as looking like it "went through a war." Is… pic.twitter.com/cbKNELXxgN
2024 పారిస్ ఒలింపిక్స్ పతకాలను విలాసవంతమైన ఆభరణాలు తయారు చేసే చౌమెట్ సంస్థ డిజైన్ చేసింది. మొదటి విజేతకు స్వర్ణం, రెండోవ ప్లేస్‌లో గెలిచిన క్రీడాకారుడికి రజతం, మూడో ప్లేస్ విన్నర్‌కు కాంస్యం పతకాలు ఇస్తారు. అయితే గోల్డ్ మెడల్ విలువ రూ.62-71వేల మధ్య ఉంటుంది. ఇందులో 92.5 శాతం వెండి, 6 గ్రాములు మాత్రమే బంగారం ఉంటుంది. స్విల్వర్ మెడల్ పూర్తిగా మెండితో తయారు చేస్తారు. దీని విలువ రూ.37వేల వరకు ఉంటుంది. బ్రౌంజ్ మెడల్ 95 శాతం రాగి, 5శాతం జింక్ మిక్స్‌డ్ మెటల్‌తో తయారు చేస్తారు. దీని తయారు చేయడానికి రూ.500 ఖర్చు అవుతుంది.
Also Read: USA: మస్క్ చేతికి టిక్‌టాక్...అమ్మే ఆలోచనలో చైనా
2024 ఆగస్టులో పారిస్ ఒలింపిక్స్ నిర్వహించారు. ప్రతి 4 సంవత్సరాలకు ఓసారి ఈ క్రీడాపోటీలు పెడతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ దేశాలు ఇందులో పాల్గొంటాయి. ఈసారి జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఓ ప్రత్యేకత ఉంది. మెడల్స్ తయారీలో పారిస్‌లో ఫేమస్ అయిన ఈఫిల్ టవర్ నుంచి తీసిన ఓ మెటల్ ముక్కను వాడారు. ఈఫిల్ టవర్‌కు 130ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీని పొడవు 330 మీటర్లు. ప్రపంచంలోనే ఎత్తైన ఈ ఐరన్ టవర్‌ను 1889లో నిర్మించారు. 1887 జనవరి 28న టవర్ కట్టడం ప్రారంభిస్తే.. 1889 మార్చి 15 నాటికి పూర్తైంది. గుస్తావ ఐఫిల్‌కి చెందిన ఫ్రెంచ్ సివిల్ ఇంజినీరింగ్ కంపెనీ దీన్ని నిర్మించింది. ఆయన పేరుమీదుగానే ఈ టవర్‌కు ఈఫిల్ టవర్ అని పిలుస్తున్నాము.
Also Read: Stock Market: పండగ పూట మంచి ఊపులో స్టాక్ మార్కెట్
గతంలో క్రీ.శ 776లోనే ఈ ఒలింపిక్స్ క్రీడలను గ్రీక్‌లోని ఎథైన్స్ నగరంలో నిర్వహించారు. తర్వాత మోడ్రన్ ఒలింపిక్స్ గేమ్స్ ఫస్ట్ టైం 1896లో గ్రీక్‌లో మళ్లీ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి 4ఏళ్లకు ఓసారి ఈ విశ్వక్రీడలు నిర్వహిస్తారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 2028 ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహిస్తారు. కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ నగరాలు ప్రస్తుతం కార్చిచ్చులో దగ్నమైతున్న విషయం తెలిసిందే. రాబోయే విశ్వ క్రీడలకు లాస్ ఏంజిల్స్‌యే వేదిక. ఇతటి హిస్టరి ఉన్న ఈ ఒలింపిక్స్ గేమ్స్‌లో ఇచ్చే మెడల్స్ విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి. కానీ.. కల్తీ మెటల్స్‌లో తయారు చేసిన పతకాలు క్రీడాకారులకు ఇస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.