గొడ్డు మాంసం తినే పవన్ సనాతన ధర్మ రక్షకుడా? భూమన కౌంటర్! గొడ్డు మాంసం తినే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షకుడు ఎలా అవుతాడని తిరుపతి మాజీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ స్వామి సనాతన ధర్మం గురించి చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందంటూ సెటైర్స్ వేశారు. By srinivas 04 Oct 2024 in Politics తిరుపతి New Update షేర్ చేయండి Pawan kalyan: సనాతన ధర్మం రక్షించేందుకు ప్రాణాలను సైతం అడ్డుపెడతానని ప్రతిజ్ఞ చేసిన పవన్ కళ్యాణ్‌పై తిరుపతి మాజీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తున్నాడంటూ సెటైర్స్ వేశారు. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన సనాతన ధర్మం గురించి చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు. పవన్ ఒక సూడో స్పిరుచ్వలిస్ట్.. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన భూమన.. తిరుపతిలో గురువారం జరిగిన వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలపై ఘటుగా స్పందించారు. 'పవన్ ఒక సూడో స్పిరుచ్వలిస్ట్. ఆయన తండ్రి దీపంతో సిగరెట్టు వెలిగించేవారు. అంటే వాళ్లు సనాతన ధర్మం పాటించారా? బాప్టిజం తీసుకున్న పవన్ సనాతన ధర్మం పాటించాడా? గొడ్డు మాంసాన్ని తింటానని చెప్పిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పాటించిన వాడు ఎలా అవుతాడు' అంటూ భూమన ప్రశ్నించారు. పవన్ స్వాములవారు పూటకో మాట.. అలాగే పవన్ ను చూస్తుంటే తనకు 'గబ్బర్ సింగ్' సినిమాలోని కెవ్వు కేక పాట గుర్తొస్తుందన్నారు. పవన్ స్వాముల వారు దీక్ష చేపట్టి జగన్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ గతంలో ఏనాడూ సనాతన ధర్మంపై మాట్లాడలేదని పవన్ కొత్త పాఠం వెనుక వేరే అజెండా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 'పవన్ స్వాములవారు పూటకో మాట మాట్లాడుతున్నారు. వైష్ణవ ప్రచారం చేసిన ఆళ్వార్‌లా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై పవన్ ఎలా మాట్లాడుతారు? అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో జంతుకొవ్వు కలిసిందని తప్పడు ప్రచారం చేయడం సరైనదికాదు' అంటూ పవన్ వ్యాఖ్యలను ఖండించారు. Also Read : ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఎలా పూజిస్తారంటే? #pawan-kalyan #tirupati #bhumana-karunakar-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి