/rtv/media/media_files/2025/03/08/QRProedxsNcA2iykAHxg.jpg)
Sugar cane juice Photograph: (Sugar cane juice)
వేసవిలో ఉక్కపోతను తట్టుకోలేక చాలా మంది జ్యూస్‌లు, లస్సీ, లెమన్ సోడా, చెరకు రసం వంటివి ఎక్కువగా తాగుతుంటారు. మిగతా అన్నింటితో పోలిస్తే.. చెరకు రసం ప్యూర్‌గా ఉంటుందని, ఇది ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తారు. ఈ క్రమంలో రోజులో రెండు నుంచి మూడు సార్లు చెరకు రసం ఎక్కువగా తాగుతుంటారు. సాధారణంగా చెరకు రసం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కువ సార్లు చెరకు రసం తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!
రోజులో ఒకటి కంటే ఎక్కువ సార్లు చెరకు రసం తాగడం మంచిది కాదు. ఎక్కువగా చెరకు రసం తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ బారిన పడేలా చేస్తాయి. అలాగే రక్తపోటు పెరుగుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజులో ఎక్కువ సార్లు చెరకు రసం తాగవద్దు. లిమిట్‌లో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.
ఇది కూడా చూడండి: You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు
చెరకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
చెరకు రసం తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తాయి. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. కొందరికి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అలాంటి వారికి చెరకు రసం బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చెరకు రసంలోని పోషకాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. రోజూ ఒక గ్లాసు చెరకు రసం తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇది కూడా చూడండి: Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: HYD NEWS: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల మనువడు దుర్మరణం