ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటారు. మహిళా సాధికారతను పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఉమెన్స్ డే థీమ్ ఏంటి? అసలు ఉమెన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు
March 8th is International Womens Day || अंतरराष्ट्रीय महिला दिवस
— General Knowledge Factory (@yuvva_bharat) March 8, 2025
Rights. Equality. Empowerment.
The theme of International Women’s Day 2025 is “For ALL Women and Girls: Rights. Equality. Empowerment.”
The year 2025 is a pivotal moment as it marks the 30th anniversary of the… pic.twitter.com/nxGZkklBS5
ఇది కూడా చూడండి: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!
1975 నుంచి..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ ఏడాది Rights, Equality, Empowerment అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. లింగ సమానత్వం లేకుండా అన్ని రంగాల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. జర్మన్ కార్యకర్త క్లారా జెట్కిన్ మహిళల హక్కుల కోసం పోరాడింది.
ఇది కూడా చూడండి: HYD NEWS: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల మనువడు దుర్మరణం
ఇది అమెరికా, యూరప్ దేశాలకు వ్యాపించడంతో అక్కడ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆ తర్వాత 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచంలో లింగ సమానత్వం లేకుండా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని, మహిళల సాధికారత కోసం అవగాహన కల్పించడం కోసం ఈ డేను జరుపుకుంటారు.