/rtv/media/media_files/2025/03/13/XWjj3S7uNePmFOM5AE1B.jpg)
Water Melon Photograph: (Water Melon)
పుచ్చకాయలను వేసవిలో విరివిగా లభ్యమవుతున్నాయి. చల్లదనం కోసం చాలా మంది అతిగా తింటారు. పుచ్చకాయ తింటే బాడీ డీహైడ్రేట్ కాదని..ఉదయాన్నే తింటారు. అందులోనూ ఫ్రిడ్జ్‌లో పెట్టి మరి తింటారు. ఇలా ఉదయాన్నే తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మ సమస్యలు, అలర్జీ వంటివి వస్తాయన్నారు.
ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్
ఉదయాన్నే ఫిడ్జ్ నుంచి తీసి..
పుచ్చకాయను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. పుచ్చకాయలో 90% నీరు ఉండటం వల్ల, ఫ్రిజ్‌లో నిల్వ చేసినప్పుడు తేమ ఎక్కువగా ఉండి, అది బ్యాక్టీరియా పెరుగుదలకు ఏర్పడుతుంది. ఇది కొన్ని సార్లు ఫుడ్ పాయిజనింగ్‌కి దోహదం చేస్తుంది. ఫ్రిజ్‌లో ఎక్కువ సమయం నిల్వ చేయడం వల్ల పుచ్చకాయలోని పోషకాల పరిమాణం కూడా తగ్గిపోతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గడం, చర్మ సమస్యలు, అలర్జీలు, జుట్టు రాలిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఇది కూడా చూడండి: బిగ్ షాక్ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !
పుచ్చకాయ చల్లగా ఉండాలని కొందరు వాటిని కట్ చేసి పీస్‌లగా ఫ్రిడ్జ్‌లో పెడతారు. దీనివల్ల ఫ్రిడ్జ్‌లోని బ్యాక్టీరియా పుచ్చకాయకి వ్యాపిస్తుంది. ఇలాంటి పుచ్చకాయలు తినడం వల్ల అలెర్జీ వంటి సమస్యలతో పాటు ఫుడ్ అలెర్జీ వస్తుంది. కొన్నిసార్లు కడుపు సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Train Hijack: రైలు హైజాక్ ..ఆపరేషన్ సక్సెస్ అంటున్న పాక్ ఆర్మీ!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!