నిత్యం మనచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్స్ అనుకున్నంత సేఫ్ కాదు. స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసే యాప్స్ ప్రైవసీ డేటాను లీక్ చేస్తున్నాయని ఇటీవల చాలా రిపోర్టులు వచ్చాయి. లొకేషన్ డేటా బ్రోకర్ అయిన గ్రేవీ అనలిటిక్స్ డేటా ప్రైవసీ ఉల్లంఘన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. యూఎస్, రష్యా దేశాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల డేటా లిక్ అవుతుందట. తీరా చూస్తే.. వినియోగదారులు ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ కారణంగానే లొకేషన్ డేటా లీక్ అవుతుందని తేలింది.
Also Read: ఓ వైపు కార్చిచ్చు..మరో వైపు చుక్కలనంటుతున్న అద్దెలు..ఇంకో పక్క
ఫ్రేమస్ గేమింగ్ యాప్ క్యాండీ క్రష్ సాగా, డేటింగ్ యాప్ టిండర్ లాంటి యాప్స్ యూజర్ల డేటాను హ్యాకర్స్‌కు లీక్ చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇవి వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టి వారి లొకేషన్, డేటాను హ్యాకర్లుకు విక్రయిస్తున్నాయి. యాప్ ఇన్టాల్ చేసేటప్పుడు మనం ఇచ్చే పర్మిషన్స్‌తో వినియోగదారుల లియర్ టైం లొకేషన్ యాక్సెస్ చేయడం వల్ల యూజర్లపై నిఘా పెడుతున్నాయని తెలిసింది.
Also Read: మరోసారి వాయిదా పడ్డ ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ!
అనేక యాప్ ఫ్లాట్ ఫాంలు డేటా ఉల్లంఘన పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వైట్ హౌస్ , క్రైమ్లిన్, వాటికన్ సిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సైనిక స్థావరాల్లో ఉన్న డివైస్‌లతో 30 మిలియన్ల లొకేషన్ డేటా పాయింట్ల ఇన్ఫర్మేషల్ లీక్ అయ్యింది. గతకొన్ని రోజుల క్రితమే ఫెడరల్ ట్రేడ్ కమీషన్ సమ్మతి లేకుండా వినియోగదారుల లొకేషన్ డేటాను విక్రయించినందుకు గ్రేవీ అనలిటిక్స్, దాని అనుబంధ సంస్థ వెన్నెల్‌ను నిషేధించారు.