Video Viral: డ్రైవర్‌ అవతారం ఎత్తిన హిట్‌మ్యాన్‌.. ఎందుకో తెలుసా..?

భారతీయుల అభిమాన క్రికెటర్‌ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ముంబై ఇండియన్స్ టీమ్‌ వెళ్తున్న బస్సును నడిపాడు. రోహిత్‌ శర్మ బస్సు డ్రైవర్‌గా మారిన వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Video Viral: డ్రైవర్‌ అవతారం ఎత్తిన హిట్‌మ్యాన్‌.. ఎందుకో తెలుసా..?

Video Viral: భారతీయుల అభిమాన క్రికెటర్‌ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. ముంబై ఇండియన్స్ టీమ్‌ వెళ్తున్న బస్సును నడిపాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఐపీఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు ఓ వీడియో సంతోషాన్ని కలిగిస్తోంది. అభిమానులను అలరించాలని నిర్ణయించుకున్న రోహిత్‌ శర్మ బస్సు డ్రైవర్‌గా మారాడు.

ఆటగాళ్లు అంతా బయల్దేరుతుండగా ఒక్కసారిగా రోహిత్‌శర్మ వెళ్లి బస్సు డ్రైవర్‌ సీటులో కూర్చొని అందరినీ నవ్వించాడు. ఆటగాళ్లంతా ఆశ్చర్యంగా చూడగా అక్కడున్న ఫ్యాన్స్‌ కేరింతలు కొడుతూ ఎంకరేజ్‌ చేశారు. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డ్‌ సాధించాడు. 203 మ్యాచ్‌లలో 5197 పరుగులు కూడా చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ ఐదు మ్యాచ్‌ల్లో 156 పరుగులు చేశాడు. అతను మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 43 పరుగులు చేయడం ద్వారా సీజన్‌ను ప్రారంభించాడు.

publive-image

ఆ తర్వాత హైదరాబాద్‌లో SRHపై కేవలం 12 బంతుల్లో మొత్తం 26 పరుగులు చేశాడు. తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్, RCBపై వరుసగా 49 రన్స్‌, 38 పరుగులు చేయడం ద్వారా పుంజుకున్నాడు. అయినా ముంబై ఇండియన్స్‌ లీగ్‌లో కాస్త వెనుకబడింది. అభిమానులంతా నిరాశగా ఉన్న సమయంలో సరదాగా రోహిత్‌ ఇలా బస్సు నడిపి అందరిలో ఉత్సాహం రేకెత్తించాడు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. మీమ్‌లు, జిఫ్‌లతో కామెంట్లు చేస్తున్నారు. టీమ్‌ని నడిపించే నిజమైన వ్యక్తి హిట్‌మ్యాన్‌ అంటూ మాట్లాడుకుంటున్నారు. బస్సు వేగం 200 కాదని తెలిసి రోహిత్‌ ఆ బస్సును నడపలేదంటూ మరో అభిమాని రాశాడు.

ఇది కూడా చదవండి: ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉందో లేదో ఈ టెక్నిక్‌తో తెలుసుకోండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు