Wrestlers Vs Brij: ఈ అవార్డులు మాకొద్దు.. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న మరో టాప్‌ రెజ్లర్!

ప్రముఖ రెజ్లర్ వీరేంద్ర సింగ్ యాదవ్ తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాక్షీ మాలిక్‌, బజరంగ్‌ పూనియా దారిలోనే తాను కూడా వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. WFI అధ్యక్షుడిగా సంజయ్ సింగ్‌ను నియమించడాన్ని వీరంతా నిరసిస్తున్నారు.

New Update
Wrestlers Vs Brij: ఈ అవార్డులు మాకొద్దు.. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న మరో టాప్‌ రెజ్లర్!

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడిగా సంజయ్ సింగ్‌ను నియమించడాన్ని నిరసిస్తున్న రెజ్లర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రముఖ రెజర్‌ సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఏడ్చేశారు సాక్షి. అటు వినేశ్‌ సైతం కన్నీరు ఆపుకోలేకపోయింది. ఇదే సమయంలో స్టార్ రెజర్ల బజరంగ పూనియా తన పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్టు ట్విట్టర్‌లో నేరుగా మోదీకి ట్యాగ్ చేశారు. పద్మశ్రీ అవార్డును మోదీకి రిటర్న్ ఇచ్చేందుకు ప్రధాని ఇంటికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన పద్మశ్రీ అవార్డును ఫుట్‌పాత్‌పైనే పెట్టి వెళ్లిపోయాడు పూనియా. ఇక తాజాగా మరో టాప్‌ రెజ్లర్ కూడా బజరంగ్‌ పూనియా దారిలోనే వెళ్తున్నాడు.

ఈ అవార్డులు మాకొద్దు:
గోల్డ్ మెడలిస్ట్, గూంగా పెహల్వాన్ అని పిలుచుకునే వీరేంద్ర సింగ్ యాదవ్ తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.2021లో గూంగా పెహల్వాన్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. అంతకు ముందు 2015లో ఆయన అర్జున అవార్డు అందుకున్నారు. సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పూనియా దారిలోనే తాను కూడా వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌, జావెలిన్ థ్రో అథ్లెట్‌ నీరాజ్‌ చోప్రా స్పందించాలని గూంగా కోరారు.

ఇక 2016 రియో ​​ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ కూడా ఇదే కారణంతో రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. పునియా నిర్ణయాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ వ్యక్తిగతంగా పరిగణిస్తుంది.అయితే అతనిని పునఃపరిశీలించేలా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. పద్మశ్రీని తిరిగి ఇవ్వడం బజరంగ్ పునియా వ్యక్తిగత నిర్ణయమని, WFI ఎన్నికలు న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. నిజానికి భారత రెజ్లింగ్ సమాఖ్యలో కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిరంకుశత్వం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈ ఏడాది(2023) ప్రారంభం నుంచి భారత రెజ్లర్లలో ఒక వర్గం నిరసనలు తెలుపుతోంది. బ్రిజ్ భూషణ్ మహిళా మల్లయోధులను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బీజేపీ ఎంపీ. చాలా కాలం పాటు ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

Also Read: అంకుర హాస్పిటల్ లో మంటలు

WATCH

Advertisment
Advertisment
తాజా కథనాలు