రేపు తిరుపతికి ఉత్తమ్.. ఇప్పటికైనా తీస్తారా గడ్డమ్? సివిల్ సప్లై , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు తిరుపతి వెళ్లనున్నారు. తన మొక్కును తీర్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తియ్యనన్నా ఉత్తమ్.. 10 ఏండ్లుగా గడ్డం తీయకుండా ఉన్నారు. కాంగ్రెస్ గెలవడంతో రేపు గడ్డం తీసుకోనున్నారు. By V.J Reddy 09 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Uttam Kumar Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సోషల్ మీడియాలో సివిల్ సప్లై , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పేరు ట్రెండ్ అవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే దాకా గడ్డం తీసుకోను అని కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ కు గతంలో సవాల్ విసిరారు ఉత్తమ్. అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం ఎప్పుడు తీసుకుంటారనే చర్చ జోరందుకుంది. గత 10ఏళ్లుగా ఉత్తమ్ కుమార్ తన గడ్డం తీయలేదు. ALSO READ: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్! ఇటీవల ఆర్టీవికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వస్తాయి.. డిసెంబర్ నాలుగవ తేదిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ(Telangana Congress) పగ్గాలను దక్కించుకుంటుంది. ఆ తరువాతే నేను గడ్డం తీసుకుంటాను అని ఉత్తమ్ అన్నారు. అయితే తన గడ్డంపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్దమైనట్లు తెలుస్తోంది. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడ మొక్కు తీర్చుకోనున్నట్లు తెలుస్తోంది. మరీ రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాలి. ALSO READ: BREAKING : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం #ktr #kcr #telugu-latest-news #uttam-kumar-reddy #congress-party #telangana-congress #revanth-ressy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి