Death Sentence: ఖైదీ రక్తనాళం కనిపించక.. ఆగిపోయిన మరణశిక్ష

అమెరికాలో ఓ ఖైదీకి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేసేందుకు అధికారులు సిద్ధం కాగా.. వైద్యులకు అతడి రక్తనాళం కనిపించకపోవడంతో మరణశిక్ష నిలిచిపోయింది. దాదాపు గంటసేపు అతడి కాళ్లు, చేతులు, భూజాలతో పాటు ఇతర భాగాల్లో వెతికిన కనిపించకపోవడంతో శిక్ష ఆగిపోయింది.

New Update
Death Sentence: ఖైదీ రక్తనాళం కనిపించక.. ఆగిపోయిన మరణశిక్ష

అమెరికాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఖైదీకి మరణశిక్ష విధిస్తుండగా అతడి రక్తనాళం దొరకకపోవడంతో ఆ శిక్ష ఆగిపోయింది. అతనికి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చేందుకు వైద్యులు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ.. రక్తనాళం కనిపించలేదు. ఇక చివరికి అతడి మరణశిక్షను నిలిపివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన థామస్‌ యూజీన్ క్రీచ్‌ (73) అనే వ్యక్తి ఓ సీరియల్‌ కిల్లర్. మూడు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేశాడు. అన్ని కేసుల్లో కూడా అతడు అనుమానితుడిగా ఉన్నాడు.

Also Read: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్‌ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్‌ ఇండియాకు భారీ జరిమానా

గంటసేపు వెతికినా దొరకలేదు

దాదాపు 50 ఏళ్లుగా అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 1981లో తోటి ఖైదీపై థామస్‌ దాడి చేయగా.. అతడు ప్రాణాలు కోల్పోయాడు. చివరికి ఈ కేసులో థామస్‌కు కోర్టు మరణశిక్షను విధించింది. అయితే అమెరికాలో మరణ శిక్ష ఎదుర్కొంటున్న దోషుల్లో ఒకరిగా ఉన్న థామస్‌కు.. శిక్ష పూర్తి చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అతడ్ని ఇడాహోలోని మరణశిక్ష విధించే ఛాంబర్‌కు తీసుకెళ్లారు. ఇందులో భాగంగా అతడికి ప్రాణాంతక ఇంజెక్షన్ అమలు చేయాల్సి ఉంది. దీనికోసం వైద్యులు.. అతడి కాళ్లు, చేతులు, భుజాలతో సహా ఇతర భాగాల్లో రక్తనాళం కోసం వెతికారు. దాదాపు గంట సేపు పాటు వెతికినా కూడా సరైన ఇంజెక్షన్ ఇచ్చేందుకు సరైన రక్తనాళం దొరకలేదు. ఇక చివరికి అతడి మరణ శిక్షను నిలిపివేశారు.

మరో వారెంట్‌ పొందాల్సిందే 

అయితే థామస్‌ డెత్‌ వారెట్‌ సమయం ముగిసిపోతుండటంతో ఇతర మార్గాల కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. కానీ రాజ్యాంగబద్ధమైన విధానంలో మరణశిక్షను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని దోషి తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు. ఈ అంశంపై విచారించిన న్యాయస్థానం.. డెత్‌ వారెంట్‌ ముగిసేలోపు మళ్లీ మరణశిక్ష అమలు చేసేందుకు ప్రయత్నించొద్దని ఆదేశించింది. దీంతో శిక్ష అమలు చేసేందుకు కొత్తగా మరో వారెంట్‌ను పొందాల్సి ఉంటుంది.

Also Read: బెంగాల్‌లో 17 లక్షల మంది నకిలీ ఓటర్లు…ఈసీకి జాబితాను సమర్పించిన మమత ప్రత్యర్థి..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

António Guterres : ఇండియా, పాక్ వార్... ఐక్యరాజ్యసమితి సంచలన ప్రకటన!

భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది.  ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ వెల్లడించారు.  రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

New Update
un António Guterres

un António Guterres

భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది.  ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ వెల్లడించారు.  రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. పహల్గామ్ దాడి తర్వాత భావోద్వేగాలను తాము అర్థం చేసుకోగలమని, పొరపాట్లు చేయొద్దని..దీనికి సైనిక చర్య పరిష్కారం కాదని తెలిపారు.  ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా తాము సహకరిస్తామని చెప్పుకొచ్చారు. పహల్గామ్ దాడిని తాను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఆయన బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.  నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు.

 రాష్ట్రాలకు కేంద్రం కీలక ప్రకటన

 మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రీల్ నిర్వహించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, శత్రు దేశాలు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఎలా వ్యవహరించాలి,  స్వీయ రక్షణపై విద్యార్థులు, పౌరులకు అవగాహన కల్పించాలి లాంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించింది. హోం శాఖ అదేశాలను బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా పాక్ తో వార్ ఉండవచ్చునని తెలుస్తోంది. కాగా ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు చంపడంతో దీని వెనుక పాకిస్తాన్ ఉందని తేలడంతో దౌత్య సంబంధాలను భారత్ తెంచుకుంది.  

Also Read :  ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...

Advertisment
Advertisment
Advertisment