TCS: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా

వ్యాపార రహస్యాలు బయటపెట్టారనే నేం కింద టీసీఎస్‌కు అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఏకంగా రూ.1600 కోట్ల జరిమానా విధించింది. DXC టెక్నాలజీ కంపెనీ..టీసీఎస్‌పై కేసు వేసింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్‌ కోర్ట్‌ టీసీఎస్‌కు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది.

New Update
TCS: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా

TCS Fined Rs 1600 Crore: టీసీఎస్‌కు భారీగా పెనాల్టీ పడింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీనే తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. వాణిజ్య రహస్యాలు టీసీఎస్ బయటపెట్టింది అంటూ డీఎక్స్‌సీ టెక్నాలజీ కంపెనీ కేసు వేసింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు నిన్న తీర్పునిచ్చింది. టీసీఎస్‌కు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. మొత్తం 194.2 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ.1,600 కోట్లు చెల్లించాలని చెప్పింది. కోర్టు నుంచి తమకు ఆర్డర్లు అందాయని టీసీఎస్ తెలిపింది.

కంపెనీకు ఎలాంటి నష్టం లేదు..

అయితే ఈ భారీ పెనాల్టీ వల్ల తమ కంపెనీ ఆర్ధిక కార్యకలాపాల మీద ఎటువంటి ప్రభావం చూపించదని తెలిపింది టీసీఎస్ యాజమాన్యం. ఈ చట్టపరమైన సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ విషయంలో తమవైపు బలమైన వాదనలు ఉన్నాయని కంపెనీ భావిస్తోంది. రివ్యూ పిటిషన్ లేదా అప్పీల్‌కు వెళ్లాలని అనుకుంటోంది.

Also Read: పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎప్పుడంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు